
గతేడాది ‘ధమాకా’తో సూపర్ సక్సెస్ అందుకున్న రవితేజ.. ప్రస్తుతం అదే సంస్థ నిర్మిస్తున్న ‘ఈగల్’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘ధమాకా’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా, అలాగే ‘ఈగల్’ ట్రైలర్‌కు ట్రెమండెస్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోమ్ బ్యానర్ లాంటింది. ‘ధమాకా’ నిన్నో మొన్నో విడుదలైనట్టు ఉంది. ఏడాది అయిందంటే నమ్మబుద్ది కావట్లేదు. ఆ చిత్రంతో టీమ్ అందరికీ మంచి పేరు వచ్చింది.
ఇక ‘ఈగల్’ సినిమా విషయానికొస్తే.. కెమెరామేన్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రంతో డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకుంటాడు. తనకి మంచి భవిష్యత్తు ఉంటుందని నా బలమైన నమ్మకం. ఇందులో ప్రేక్షకులకు ఒక కొత్త రవితేజను చూపించబోతున్నాడు. అది నాకు చాలా తృప్తిని ఇచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నా’ అని అన్నారు. ‘గత ఏడాదిని బ్లాక్ బస్టర్‌తో ఎండ్ చేశాం.
నెక్స్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్‌తో మొదలుపెడతాం’ అని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ధమాకా’కి సినిమాటోగ్రాఫర్‌గా చేసి, ‘ఈగల్’ను డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉందని చెప్పాడు కార్తీక్ ఘట్టమనేని. హీరోయిన్స్ శ్రీలీల, కావ్య థాపర్, శ్రీనివాస్ అవసరాల తదితరులు పాల్గొన్నారు.