లండన్లో రవితేజ..ఈగల్ మూవీ షూటింగ్

లండన్లో రవితేజ..ఈగల్ మూవీ షూటింగ్

డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని(Kartik Gattamaneni) డైరెక్షన్స్ లో మాస్ రాజా రవితేజ హీరోగా వస్తోన్న మూవీ ఈగల్(Eagle). డిఫరెంట్ థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసి క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. 

లేటెస్ట్గా ఈ మూవీ షూటింగ్ కోసం హీరో రవితేజ లండన్ వెళ్తున్నట్టు ఇంస్టాగ్రామ్ లో వీడియో రిలీజ్ చేశారు. మాస్ రాజా స్టైల్గా నడుస్తూ వెళ్తున్న వీడియోతో పాటు..ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్ సూట్‌లో ఉన్న ఫోటోను రవితేజ పోస్ట్ చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నఈ మూవీ..లండన్ లో పలు కీలక సన్నివేశాలతో పాటు ఒక బ్యూటిఫుల్ సాంగ్ను షూట్ చేస్తున్నట్లు తెలిపారు. 

డేగ వంటి పలు హిట్ సినిమాలకి సినిమాటోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని..ఈ మూవీతో డైరెక్టర్ గా తన సత్తాను చాటుకోవడానికి థ్రిల్లర్ ఓరియెంటెడ్ సబ్జెక్టు తో వస్తున్నారు. ఈ మూవీ 2024 సంక్రాంతిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. 

ఈగల్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌లో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran), కావ్య థాపర్(Kavya thapar) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే శ్రీనివాస్ అవసరాల(Srinivas Avasarala), నవదీప్(Navadeep),మధుబాల(Madhubala) కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇక రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ దసరా స్పెషల్గా అక్టోబర్ 20న విడుదల అవనుంది. వచ్చే నెల (సెప్టెంబర్ )నుంచి డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా చిత్రీకరణకు రవితేజ హాజరుకానున్నారని తెలుస్తోంది.