Mr Bachchan: ఏం తమ్ముళ్లు..మెట్రో ప్రయాణికులతో రవితేజ మాట్లాడే ఆడియో విన్నారా?

Mr Bachchan: ఏం తమ్ముళ్లు..మెట్రో ప్రయాణికులతో రవితేజ మాట్లాడే ఆడియో విన్నారా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా  స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌’(Mr Bachchan). భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌‌.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతోంది.

ఇప్పటికే పాటలతో ఆడియన్స్ను ఇంప్రెస్ చేసిన మేకర్స్..ఈ సారి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ప్రయాణికులను సర్ప్రైజ్ చేశారు.అదేంటని అనుకుంటున్నారా?  అవును ప్రయాణికులతో రవితేజ మాట్లాడే ఆడియో వింటే మీకే అర్ధం అవుతుంది. వివరాల్లోకి వెళితే..తాజాగా మిస్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌ మేకర్స్ వరుస ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్లను సెలెక్ట్ చేసుకుంది. ఈ మేరకు హీరో రవితేజ వాయిస్ తో ఇపుడు మెట్రో ప్రయాణికులను మిస్టర్ బచ్చన్ థియేటర్లోకి వెల్ కం చెబుతుంది.

'మెట్రో ప్రయాణికులకు స్వాగతం.. సుస్వాగతం'..అంటూ "ఏం తమ్ముళ్లు..మెట్రోలో ప్లేస్ దొరకలేదా.? లేకుంటే కూర్చోగానే లేపేస్తున్నారా.? అయినా పర్లేదు..మిస్టర్ బచ్చన్ నుండి లేటెస్ట్గా పాట రిలీజ్ అయింది..హ్యాపీగా వినుకుంటూ నిల్చొని మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా వెళ్లండి అంటూనే..ఇక్కడ సీటు దొరకపోయినా పర్లేదు..ఆగస్టు 15న సినిమా థియేటర్ కు వచ్చేయండి అక్కడ మీ కోసం సీటు గ్యారెంటీ" అంటూ హీరో రవితేజ వాయిస్ మెసేజ్ తో ప్రయాణికులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఈ వాయిస్ మెసేజ్ వింటున్న మెట్రో ప్రయాణికుల రియాక్షన్ అదిరిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.