రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో ఈ మూవీ షూట్ జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు. దీంతో జులై లేదా ఆగస్టులో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ ఇందులోని కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయని మేకర్స్ అన్నారు. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్స్ ద్వారా రివీల్ చేశారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
