IND vs ENG 5th Test: కెరీర్‌లో వందో టెస్టు.. అశ్విన్‌ చెత్త రికార్డు 

IND vs ENG 5th Test: కెరీర్‌లో వందో టెస్టు.. అశ్విన్‌ చెత్త రికార్డు 

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా 500 పరుగుల దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి 8 వికెట్లు కోల్పోయి 478 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(103), శుభ్ మాన్ గిల్(110) సెంచరీలు బాదగా.. దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రం ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. 

ధర్మశాల టెస్టుతో అంతర్జాతీయ కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న అశ్విన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటినా... బ్యాటింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కెరీర్‌లో వందో టెస్టు అంటే ఏ  ఆటగాడికైనా ప్రత్యేకమే. అలాంటిది అశ్విన్‌ ఐదు బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా ఔట్ అవ్వడంతో ఓ చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది.

వందో టెస్టులో డకౌట్‌ అయిన క్రికెటర్లు

  • దిలీప్ వెంగ్‌సర్కార్: న్యూజిలాండ్‌పై (1988) 
  • అలన్ బోర్డర్: వెస్టిండీస్‌పై (1991)
  • కోర్ట్నీ వాల్ష్: ఇంగ్లాండ్‌పై
  • మార్క్ టేలర్: ఇంగ్లాండ్‌పై (1998) 
  • స్టీఫెన్ ఫ్లెమింగ్: సౌతాఫ్రికాపై (2006)
  • బ్రెండన్ మెకల్లమ్: ఆస్ట్రేలియాపై (2016)
  • అలిస్టర్ కుక్: ఆస్ట్రేలియాపై (2013)
  • చెతేశ్వర్ పుజారా: ఆస్ట్రేలియాపై (2023)
  • రవిచంద్రన్ అశ్విన్: ఇంగ్లాండ్‌పై (2024)

ALSO READ :- IND vs ENG: అండర్సన్‌తో గొడవ.. ఆ మాటలు బయట పెట్టను: శుభ్‌మాన్ గిల్