
ఇంగ్లాండ్ తో ముగిసిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారుతూ పరుగుల వరద పారించాడు. 100 కాదు.. 200 కాదు ఒకే టెస్టులో ఏకంగా 430 పరుగులు చేసి ఔరా అనిపించాడు. తొలి ఇన్నింగ్స్ 269 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడి చరిత్ర సృష్టించిన గిల్.. రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేసి ఔరా అనిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో గిల్ స్ట్రైక్ రేట్ 70 ఉంటే రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 100 ఉండడం విశేషం. జట్టును ముందుండి నడిపించిన గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం పట్ల టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకునే అర్హత లేదని అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఆకాశ్ దీప్ ఉత్తమ ఎంపిక అని అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసిన ఆకాష్.. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు పడగొట్టి ఒకే టెస్టులో 10 వికెట్లు తీసుకొని ఇంగ్లాండ్ గడ్డపై ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
►ALSO READ | రీల్స్ వద్దంటే వినలే..! టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్‌ను కాల్చి చంపిన తండ్రి
తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా అశ్విన్ మాట్లాడుతూ.. " నేను చెప్పే విషయం షాకింగ్ గా అనిపించవచ్చు. రెండో టెస్టులో ఆకాష్ దీప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కేందుకు అర్హుడు. శుభమాన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఎన్ని ప్రశంసలు ఇచ్చినా సరిపోదు. రికార్డులతో చరిత్ర సృష్టించాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆకాష్ దీప్ రెండు ఇన్నింగ్స్ ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు.. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో అతని నాలుగు వికీట్ల కారణంగా సిరాజ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టగలిగాడు.
ఆకాష్ దీప్ ఒకే మణికట్టు స్థానంలో వివిధ కోణాల నుండి బంతిని డెలివరీ చేస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో నాకు ఎలాంటి సమస్య లేదు. ఐపీఎల్ మ్యాచ్ లో, సూపర్ ఫోర్లు, సూపర్ సిక్సర్లు, ఫాస్టెస్ట్ డెలివరీకి అవార్డులన్నీ ఉంటాయి. టెస్టుల్లో కూడా ఇలాంటి రూల్స్ ఉండాలి. టెస్టుల్లో కూడా బౌలర్ ఆఫ్ ది మ్యాచ్.. బ్యాట్స్ మన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఉండాలి". అని ఈ వెటరన్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.