నా ఫ్యామిలీకి చాలా స్పెషల్‌‌‌‌‌‌‌‌ : రవి చంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌

నా ఫ్యామిలీకి చాలా స్పెషల్‌‌‌‌‌‌‌‌ : రవి చంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌
  • వందో టెస్ట్‌‌‌‌‌‌‌‌పై రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్య
  • 2012 ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌ టర్నింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌

ధర్మశాల: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో జరగనున్న ఐదో టెస్ట్‌‌‌‌‌‌‌‌.. ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవి చంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో వందో టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కానుంది. ఇందులో ఆడితే టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన 14వ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా అతను రికార్డు సృష్టిస్తాడు. ఈ సందర్భంగా అశ్విన్‌‌‌‌‌‌‌‌ మీడియాతో మాట్లాడాడు. ‘వందో టెస్ట్‌‌‌‌‌‌‌‌ నా కంటే నా ఫ్యామిలీకే ఎక్కువ స్పెషల్‌‌‌‌‌‌‌‌. నా కోసం కొన్ని ఏళ్లుగా త్యాగాలు చేశారు. చాలా మందికి అంకెలు గుర్తు పెట్టుకోవడం చాలా ఇష్టం. నన్ను కూడా అందరూ అలాగే అనుకుంటారు.

 కానీ నేను వాటికి చాలా దూరం. మా నాన్నకు ఈ మ్యాచ్ వెయ్యి రెట్లు స్పెషల్‌‌‌‌‌‌‌‌. నా తల్లి, భార్య, కుమార్తెలు కూడా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నా వరకైతే ఇది ఓ సంఖ్య మాత్రమే’ అని అశ్విన్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. 2012 ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన సిరీస్‌‌‌‌‌‌‌‌ తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో టర్నింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ అని ఈ తమిళనాడు స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. అప్పుడు జరిగిన సిరీస్‌‌‌‌‌‌‌‌లో తాను నేర్చుకోకపోతే ఇప్పుడు ఈ స్థాయి బౌలర్‌‌‌‌‌‌‌‌గా ఉండే వాడిని కాదన్నాడు. 

‘ఇది నాకు చాలా పెద్ద సందర్భం. గమ్యం కంటే ప్రయాణం చాలా ప్రత్యేకమైందని నేను భావిస్తా. ఈ హెచ్చు తగ్గుల ప్రయాణంలో నేను చాలా నేర్చుకున్నా. 2012 సిరీస్‌‌‌‌‌‌‌‌ నా కెరీర్‌‌‌‌‌‌‌‌కు టర్నింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌. కుక్‌‌‌‌‌‌‌‌, పీటర్సన్‌‌‌‌‌‌‌‌ లాంటి వాళ్లకు బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేయడం వల్ల చాలా ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఆ వెంటనే ఆసీస్‌‌‌‌‌‌‌‌తో జరిగిన సిరీస్‌‌‌‌‌‌‌‌లో అది నాకు బాగా ఉపయోగపడింది. ఇక టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిపోవడం అనేది మన చేతుల్లో లేదు. కొన్ని సందర్భాల్లో భయపడినా నా పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌పై ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదు. ఫామ్‌‌‌‌‌‌‌‌ కోల్పోయినప్పుడల్లా బేసిక్స్‌‌‌‌‌‌‌‌ నుంచి మొదలుపెట్టి సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యా’ అని అశ్విన్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు.