దుస్తులను ఎలా గుర్తించాలో రవిచంద్రన్ అశ్విన్ను చూసి నేర్చుకోవాలి

దుస్తులను ఎలా గుర్తించాలో రవిచంద్రన్ అశ్విన్ను చూసి నేర్చుకోవాలి

టీ20 వరల్డ్ కప్2022లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసి సెమీస్కు చేరింది. బ్యాటింగ్, బౌలింగ్లో ప్లేయర్లు అద్భుతంగా రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. లేటు వయసులో టీమిండియా టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కించుకున్న రవిచంద్రన్ అశ్విన్ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. బ్యాటుతో కొన్ని విలువైన పరుగులు చేస్తున్నా..తన స్పిన్తో మాత్రం ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టలేకపోతున్నాడు. అయితే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో అశ్విన్ చేసిన ఓ పని ప్రస్తుతం వైరల్గా మారింది. 

వాసన ఎందుకు చూశాడు..?
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో... టాస్ సమయంలో రోహిత్ శర్మ  ఇయాన్ బిషప్‌తో సంభాషిస్తున్నారు. ఈ సమయంలో అశ్విన్ కొద్ది దూరంలో ఏదో పనిలో ఉన్నాడు. దీంతో అశ్విన్ అక్కడ  ఏం చేస్తున్నాడా? అని ఇయాన్ బిషప్ గమనించాడు. ఈ సమయంలో  అశ్విన్ ...తన స్వెటర్ను గమనించే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో  అక్కడ ఉన్న స్వెటర్లను అటూ ఇటూ తిప్పి చూశాడు. చివరకు తన స్వెటర్ను గమనించలేకపోయిన అశ్విన్...వాటిని వాసన చూడటం మొదలు పెట్టాడు. అందులో ఒక స్వెటర్ను తీసుకుని వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. 

సైజు కోసం చెక్ చేశా..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై  అశ్విన్‌ స్పందించాడు. ముందుగా స్వెటర్ సైజు కోసం చెక్ చేశానని చెప్పాడు. దానిపైన ఏమైనా పేర్లు ఉన్నాయేమో అని చూశానన్నాడు. ఆ తర్వాత తాను వాడే పెర్‌ఫ్యూమ్ వాసన చూసి స్వెటర్ తీసుకున్నట్లు వెల్లడించాడు. 

ఫన్నీకామెంట్స్..
అశ్విన్  వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. అభినవ్ ముకుంద్, హర్భజన్ సింగ్ కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. అశ్విన్ ఏం చేస్తున్నాడు.. ఏం వాసన చూస్తున్నావ్ అశ్విన్ అన్న అనికొందరు కామెంట్స్ చేశారు. మరికొందరైతే.. ఆ స్వెటర్ నీదేనా.. దుస్తులను గుర్తించే అసలైన మార్గం ఇదే అంటూ కామెంట్లు పెట్టారు.