IND vs ENG 2025: దమ్ముంటే తిరుగు.. సెంచరీకి ముందు రూట్‌ను భయపెట్టిన జడేజా

IND vs ENG 2025: దమ్ముంటే తిరుగు.. సెంచరీకి ముందు రూట్‌ను భయపెట్టిన జడేజా

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ తొలి రోజును అద్భుతంగా ముగించింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో  రూట్ అజేయంగా 99 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను పటిష్ట స్థితిలో ఉంచాడు. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకున్న రూట్.. 191 బంతుల్లో 9 ఫోర్లతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి రోజు ఆట ముగుస్తుందననుకున్న సమయంలో రూట్ సెంచరీ  చేసే అవకాశం ఉన్నప్పటికీ.. జడేజా కారణంగా 99 పరుగుల వద్ద ఆగిపోయాడు. సరదాగా జడేజా చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

తొలి రోజు ఆటలో భాగంగా ఆకాష్ దీప్ తన చివరి ఓవర్ వేశాడు. ఈ ఓవర్ కు ముందు రూట్ 96 తో క్రీజ్ లో ఉన్నాడు. రెండో బంతికీ రెండు పరుగులు తీసుకున్న రూట్ 98 పరుగులకు చేరుకున్నాడు. నాలుగో బంతికి థర్డ్ మ్యాన్ వైపు కొట్టి సింగిల్ పూర్తి చేసుకున్నాడు. రెండో పరుగు తీద్దామా.. వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సమయంలో జడేజా బంతిని కింద పడేసి రూట్ వైపుగా చూస్తూ రన్ తిరుగు అని సైగలు చేశాడు. రూట్ తిరగాలనుకున్నప్పటికీ రిస్క్ ఎందుకు అని ఆగిపోయాడు. చివరి రెండు బంతులను స్టోక్స్ డిఫెన్స్ ఆడడంతో పరుగులేమీ రాలేదు. జడేజా చేసిన ఈ చిలిపి పనితో రూట్ తొలి రోజు 99 పరుగుల వద్ద నాటౌట్ గా మిగిలిపోయాడు.

ALSO READ : గిల్‌కు వన్డే కెప్టెన్సీ.. రోహిత్ శర్మను తప్పించడానికి కారణం ఇదే!

తొలి రోజు జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే గురువారం మొదలైన మూడో టెస్ట్‌‌లో ఇంగ్లండ్‌‌కు శుభారంభం లభించింది. జో రూట్‌‌ (191 బాల్స్‌‌లో 9 ఫోర్లతో 99 బ్యాటింగ్‌‌), ఒలీ పోప్‌‌ (44) రాణించడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 83 ఓవర్లలో 251/4 స్కోరు చేసింది. రూట్‌‌తో పాటు బెన్‌‌ స్టోక్స్‌‌ (39 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు. నితీశ్‌‌ రెడ్డి రెండు వికెట్లు తీశాడు. బుమ్రా, జడేజాలకు తలో వికెట్ దక్కింది.