Shubman Gill: గిల్‌కు వన్డే కెప్టెన్సీ.. రోహిత్ శర్మను తప్పించడానికి కారణం ఇదే!

Shubman Gill: గిల్‌కు వన్డే కెప్టెన్సీ.. రోహిత్ శర్మను తప్పించడానికి కారణం ఇదే!

భారత క్రికెట్ లో మరో సంచలన మార్పు బీసీసీఐ తీసుకోబోతున్నట్టు సమాచారం. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ ను వన్డేల్లో కూడా సారధ్య బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా వన్డే కెప్టెన్ గా ఉంటున్న రోహిత్ శర్మ స్థానంలో గిల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఇద్దరు జర్నలిస్టులు పోస్టా పోస్ట్ చేయడం గురువారం (జూలై 10) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా తదుపరి ఆడబోయే వన్డే సిరీస్ కు గిల్ టీమిండియా వన్డే కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది. 

టీమిండియా తమ తదుపరి వన్డే సిరీస్ ను అక్టోబర్ లో ఆస్ట్రేలియాపై ఆడనుంది. ఈ సిరీస్ నుంచి గిల్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తుంది. గిల్ భవిష్యత్ కెప్టెన్ గా కితాబులు అందుకుంటున్నాడు. టీ20 ఫార్మాట్ లోనూ ఈ టెస్ట్ కెప్టెన్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వనున్నట్టు సమాచారం. చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ నుంచి దూరమైన హిట్ మ్యాన్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్ లను కొనసాగడం బీసీసీఐ ఆలోచనల్లో లేనట్టు స్పష్టమవుతుంది. 

ALSO READ : ఎంసీసీ మ్యూజియంలో సచిన్‌‌‌‌ చిత్రపటం

రోహిత్  తప్పించడానికి కారణం ఇదే!

రోహిత్ శర్మ ప్రస్తుత వయసు 37 సంవత్సరాలు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఆడడం దాదాపుగా ఖాయమైంది. ఫిట్ నెస్ లో హిట్ మ్యాన్ కు సమస్యలు ఉన్నాయి. ఇటీవలే ఐపీఎల్ లో సైతం రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. దీంతో పాటు ఇప్పటి నుంచే గిల్ కు కెప్టెన్ గా అవకాశమిస్తే 2027 వరల్డ్ కప్ లోపు అనుభవాన్ని సంపాదించుకుంటాడనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని గిల్ కు టెస్ట్, వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.