ఐపీఎల్‌‌ నుంచి జడేజా ఔట్‌‌

ఐపీఎల్‌‌ నుంచి జడేజా ఔట్‌‌

ముంబై: ఐపీఎల్‌‌లో కాస్త ఆలస్యంగా పుంజుకున్న చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌కు షాక్‌‌. ఈ సీజన్‌‌లో మిగిలిన మ్యాచ్‌‌లకు  ఆ టీమ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా దూరమయ్యాడు. ఈ నెల 4న  రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌‌ లో ఫీల్డింగ్‌‌ చేస్తుండగా జడేజా పక్కటెముకలకు గాయమైంది. దాంతో, 8న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌‌లో తను ఆడలేదు.  గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సీఎస్‌‌ కే ఆడబోయే చివరి మూడు మ్యాచ్‌‌లకు జడేజా దూరంగా ఉంటాడని చెన్నై ఫ్రాంచైజీ బుధవారం ప్రకటించింది.