
బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో స్పీడ్‌గా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా తన 76వ చిత్రాన్ని ప్రకటించాడు. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ వెరీ స్టైలిష్ గెటప్‌లో, డిజైనర్ సూట్ వేసుకుని మెస్మరైజ్ చేస్తున్నాడు.
ఎయిర్‌క్రాఫ్ట్ సీటులో హాయిగా కూర్చున్న అతను, ముందు సీటుపై కాలు పెట్టుకుని రిలాక్స్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో స్పానిష్ పుస్తకం ఉండటం ఆసక్తిని పెంచుతోంది. నేను శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలు తీసిన కిషోర్ తిరుమల.. రవితేజ సిగ్నేచర్ స్టైల్ కామెడీతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందించబోతున్నట్టు తెలియజేశారు.
జూన్ 16 నుంచి హైదరాబాద్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నట్టు చెబుతూ.. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు రవితేజ నటించిన ‘మాస్ జాతర’ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది.