Eagle Movie 1st Day Collections: మొదటి రోజు ఈగల్ జోరు.. కలెక్షన్స్ కుమ్మేసిన మాస్ మహారాజ్

Eagle Movie 1st Day Collections: మొదటి రోజు ఈగల్ జోరు.. కలెక్షన్స్ కుమ్మేసిన మాస్ మహారాజ్

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle). అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాపై ముందునుండే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేయడంతో ఈగల్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించారు. పలు వాయిదాల మధ్య ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదటి షో నుండే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమా సూపర్ అంటుంటే.. మరికొందరేమో యావరేజ్ గా ఉందంటూ కామెంట్స్ చేశారు. ఇక రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఫుల్లుగా ఎంజయ్ చేస్తున్నారు. రవితేజ గెటప్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ కి రెచ్చిపోతున్నారు. ఇది రావన్న మాస విశ్వరూపం అంటూ కామెంట్స్ చేస్తుంన్నారు. దీంతో మొదటిరోజు సూపర్ కలెక్షన్స్ రాబట్టింది ఈగల్ మూవీ.

రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈగల్ మూవీ.. తొలిరోజు రూ. 6 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. మరో రూ.16 కోట్ల రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలోకి వెళుతుంది ఈ సినిమా. రానున్న రెండు రోజులు వీకేడ్ కావడం, పోటీగా సినిమాలు లేకపోవడం వల్ల ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. నిజానికి రవితేజ గత సినిమాలతో పోల్చితే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. అంతేకాదు.. ఈగల్ సినిమాపై ముందునుండి మంచి బజ్ క్రియేట్ అవలేదు. వాయిదాలు పడటం కూడా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. అన్ని ప్రాపర్ గా జరిగుంటే.. ఈగల్ సినిమాకు మొదటిరోజు సూపర్ కలెక్షన్స్ వచ్చి ఉండేవని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.