రవితేజ మాస్ జాతర డబ్బింగ్ షురూ.. వినాయక చవితికి థియేటర్లోకి

రవితేజ మాస్ జాతర డబ్బింగ్ షురూ.. వినాయక చవితికి థియేటర్లోకి

రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’.  సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై  నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సోమవారం (జులై 28) నుంచి రవితేజ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఆయన డబ్బింగ్ చెబుతున్న ఫొటో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 రవితేజ కెరీర్‌‌‌‌లో ఇది 75వ చిత్రం. ఇందులో ఆయన  పవర్‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా కనిపించనున్నాడు.  ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తుంటే, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.  ఇప్పటికే రిలీజ్ చేసిన  గ్లింప్స్‌‌, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.  వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.  --