తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యం

తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యం

హైదరాబాద్ : రావుల శ్రీధర్ రెడ్డి,అతని అనుచరులపై తాను పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటానన్నారు జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. తనకు, శ్రీధర్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయన్నారు గోపీనాథ్. మంత్రి కేటీఆర్ సమక్షంలో TRSలో చేరారు శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ రెడ్డి.. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. బీజేపీ కల్లిబొల్లి మాటలు, అబద్దాల ప్రచారంతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని చెప్పుకొచ్చారు. దుబ్బాక చైతన్యమైన ప్రాంతమని.. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు నడకేనని శ్రీధర్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు శ్రీధర్ రెడ్డి.

తెలంగాణకు టీఆర్ఎస్ మాత్రమే శ్రీ రామ రక్ష అన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు 29 ఎజెండాలుంటాయన్న కేటీఆర్..TRSకు తెలంగాణ మాత్రమే ఎజెండా అన్నారు. మతం పేరుతో అల్లర్లు సృష్టించాలని చూస్తే అవి సఫలం కావన్నారు మంత్రి కేటీఆర్.