గాల్లో ఎగిరే డ్రోన్ కెమెరా ఫోన్: ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వేరే లెవెల్ అంతే..

గాల్లో ఎగిరే డ్రోన్ కెమెరా ఫోన్: ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వేరే లెవెల్ అంతే..

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఒక అద్భుతమైన స్మార్ట్ ఫోనుతో రాబోతుంది. ఈ ఫోన్  కేవలం కాల్స్ కోసం మాత్రమే కాదు, గాలిలోకి ఎగిరి ఫోటోలు కూడా తీయగలదు.. నమ్మలేకపోతున్నారా... కానీ ఇది నిజం. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెషలిటీ ఏంటంటే దీనికి ఒక చిన్న డ్రోన్ కెమెరా అందించారు.

 వివో ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా ఫోన్ అని పిలువబడే ఈ కొత్త కాన్సెప్ట్ గేమ్-ఛేంజర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో ఫోన్ నుండి విడిపోయే డ్రోన్ కెమెరా ఉంది, ఇది ఎగురుతూ గాలి నుండి హై - క్వాలిటీ ఫోటోలు, వీడియోలు  తీయగలదు. ఇది మొబైల్ ఫోటోగ్రఫీలో ఒక పెద్ద ముందడుగు.

స్మార్ట్‌ఫోన్ కెమెరాలు ఇప్పటికే  కెమెరాలను భర్తీ చేశాయి, కానీ Vivo DSLR లాంటి క్వాలిటీతో కూడిన ఫ్లయింగ్ కెమెరా అందించడం గొప్ప విషయం. ఈ ఫోన్ 5G, AI ఫీచర్లు ఇంకా మీ జేబులో సరిపోయే స్లిమ్ డిజైన్‌తో వస్తున్న  పవర్ ఫుల్ Android ఫోన్. వ్లాగర్లు, ట్రావెలర్స్, కంటెంట్ క్రియేటర్స్ కోసం Vivo Jovi V50 5G ఫోటోలు, వీడియోలు తీసే  విధానాన్ని మార్చగలదు. 

ఎగిరే స్మార్ట్‌ఫోన్ ? వివో ఎలా సాధ్యం చేసింది : వివో ఎగిరే డ్రోన్ ఫోన్ మంచి కెమెరా ఉన్న ఫోన్ మాత్రమే కాదు.  టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్స్  వేగంగా ప్రజాదరణ పొందడంతో కంటెంట్ వీడియోలు తీసేందుకు  కొత్త మార్గాలను వెతుకుతున్నారు. వివో అలంటి వారి కోసం ఈ ఫోన్ తీసుకొస్తుంది. ఈ వివో ఫోన్‌లో ఉన్న ఒక చిన్న డ్రోన్‌ అవసరమైనప్పుడు ఫోన్ నుండి విడిపోయి ఎగిరి  కెమెరాతో ఫోటోలు తీస్తుంది. ఈ ఫోన్ స్టైలిష్ గా, మెటాలిక్ మెటీరియల్తో AMOLED డిస్ ప్లేతో  వస్తుంది. రిమోట్ అవసరం లేకుండా ఫోన్‌లోని గెస్చర్స్  ఇంకా యాప్ ఉపయోగించి కంట్రోల్ చేయవచ్చు. 

ALSO READ : టూల్స్ & గాడ్జెట్స్ : సగన్ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రూఫ్ ఫోన్ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బ్యాటరీ లైఫ్,  కెమెరా : ఎగిరే ఫోన్‌కు బ్యాటరీ అవసరం కాబట్టి ఈ ఫోన్లో  స్ప్లిట్-బ్యాటరీ ఉంది. బ్యాటరీలోని ఒక భాగం ఫోన్‌కు, మరొక భాగం డ్రోన్‌ను ఛార్జ్ చేస్తుంది. 

ఈ డ్రోన్ ఒకసారి ఛార్జ్ చేస్తే 8-10 నిమిషాలు ఎగురుతూ ఫొటోస్ తీస్తుంది. 4K వీడియో, 108MP ఫోటోలను షూట్ చేస్తుంది. AI ట్రాకింగ్ ఉపయోగించి మిమ్మల్ని ఆటోమేటిక్'గా  ట్రాక్ చేస్తుంది. అలాగే 15 మీటర్ల దూరం వరకు ఎగురుతుంది. 

ధర ఎంతంటే : వివో జోవి V50 5G ధర సుమారు రూ.89,999 ఉంటుందని అంచన. ఇతర హై-ఎండ్ ఫోన్‌లో ఇలాంటి ఫ్లయింగ్ కెమెరా లేదు.  
 
లాంచ్ తేదీ : వివో జోవి V50 5G ఈ ఏడాది చివరిలో ఇండియా, చైనా, యూరోపియన్ దేశాల్లో  లాంచ్ అవుతుంది. ప్రీ-ఆర్డర్లు అక్టోబర్‌లో ప్రారంభమై నవంబర్‌లో డెలివరీ అవుతాయి.