
గిగ్ వర్కర్లు, బైక్ ట్యాక్సీలు నడిపేవాళ్లు వర్షంలో కూడా పనిచేస్తూనే ఉంటారు. రూట్ మ్యాప్ కోసం ఫోన్‌ని బైక్ మొబైల్ హోల్డర్లలో పెడుతుంటారు. కానీ.. సడెన్‌గా వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి? అందుకే ఈ వాటర్‌ఫ్రూఫ్ హోల్డర్‌ని వాడితే సరిపోతుంది. దీన్ని ఎల్లోఫిన్ అనే కంపెనీ తీసుకొచ్చింది.
ఇది ఐపీ67 రేటింగ్‌తో వస్తుంది. దీన్ని ఈజీగా హ్యాండిల్ బార్‌కి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 7 అంగుళాల స్క్రీన్ ఉండే ఫోన్లను కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఫోన్ కింద పడిపోకుండా ఉండేందుకు మెకానికల్ లాక్ ఉంటుంది. స్పీడ్ బంప్‌లు, బురద, గతుకుల రోడ్ల మీద బైక్ నడిపినా ఫోన్ జారిపడదు. అంతేకాదు.. టచ్ స్క్రీన్ ద్వారా ఆపరేట్ చేయడానికి మొబైల్ బయటకు తీయాల్సిన అవసరం లేదు. హెడ్‌ఫోన్‌లను ప్లగ్ చేయడానికి, చార్జింగ్ కేబుల్ పెట్టడానికి ప్రత్యేకంగా పోర్ట్ ఉంటుంది. ఈ పోర్ట్ నుంచి కూడా నీళ్లు లోపలికి పోకుండా డిజైన్ చేశారు. మౌంట్ బేస్‌లో యూనివర్సల్ బాల్ ఉంటుంది. దానివల్ల ఫోన్‌ని 360 డిగ్రీలు ఎటువేపైనా తిప్పుకోవచ్చు.
ధర: రూ. 1,799
హెల్మెట్ హెడ్‌సెట్
బైక్ నడుపుతున్నప్పుడు ఫోన్ కాల్స్ వస్తే.. ప్రతిసారి హెల్మెట్ తీసి మాట్లాడడం కాస్త చిరాకుగా అనిపిస్తుంది. ఈ హెడ్‌సెట్‌ని హెల్మెట్‌కి అటాచ్ చేసుకుంటే బైక్‌ని పక్కకు నిలిపి హెల్మెట్ తీయకుండానే కాల్స్ మాట్లాడుకోవచ్చు. దీన్ని ఏడీఎల్ కంపెనీ తీసుకొచ్చింది.
►ALSO READ | గుండె ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే.. తీరని నష్టం తప్పదు
బ్లూటూత్ ద్వారా ఒకేసారి రెండు మొబైల్ ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో జీపీఎస్ వాయిస్ గైడెన్స్ కూడా వినొచ్చు. ఇందులో 800 MAh రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. టైప్ సీ కేబుల్‌తో చార్జ్ చేసుకోవచ్చు. ఐపీ 67 వాటర్‌ప్రూఫ్‌తో రావడం వల్ల వర్షంలో కూడా పనిచేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ఆన్సర్ ఫీచర్ ఉండడం వల్ల కాల్స్‌కి 10 సెకన్లలో అదే ఆన్సర్ చేస్తుంది.
ధర: రూ. 1,750