గురుపౌర్ణమి రోజున అరుణాచలం వెళుతున్నారా.. ఈ ప్రత్యేక దర్శనం గురించి తెలుసుకోండి..!

గురుపౌర్ణమి రోజున అరుణాచలం వెళుతున్నారా.. ఈ ప్రత్యేక దర్శనం గురించి తెలుసుకోండి..!

అరుణాచలం.. శివయ్య దర్శనానికి వెళ్లే భక్తులు ఎందరో.. ఇక పౌర్ణమి రోజుల్లో లక్షల మంది భక్తులు అరుణాచలం వెళతారు. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయటం కోసమే వెళతారు. అలాంటిది రాబోయే గురు పౌర్ణమి రోజున లక్షల మంది భక్తులు అరుణాచలం వెళుతుండటంతో అక్కడి ఆలయం ప్రత్యేక నోట్ రిలీజ్ చేసింది. 2025, జూలై 10వ తేదీ పౌర్ణమి.. అందులోనూ గురుపౌర్ణమి కావటంతో.. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక దర్శనం టైమింగ్స్ ప్రకటించింది. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం సమయాలు కేటాయించినట్లు అరుణాచలం దేవస్థానం ప్రకటించింది.

జూలై 10వ తేదీ గురుపౌర్ణమి రోజు.. ఉదయం 10 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వృద్ధులు, చిన్నారులు ఆలయ ఉత్తర ద్వారం నుంచి నేరుగా వెళ్లి శివయ్య దర్శనం చేసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఈ అవకాశం. దీని కోసం ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది.. 

వీల్ చైర్ ఉపయోగించే దివ్యాంగులకు పశ్చిమ ద్వారం నుంచి ప్రత్యేక దర్శన అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో వీరిని అనుమతిస్తామని తెలిపింది.

►ALSO READ | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం..సహేలీ స్మార్ట్ కార్డులు

వయో వృద్ధులు, స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం బ్యాటరీ కార్ల సదుపాయం ఏర్పాటు చేశామని.. ఇందు కోసం 9487555441 నెంబర్‎కు కాల్ చేయాలని సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఆలయం దగ్గర హెల్త్ ఎమర్జెన్సీ సర్వీస్, ఫస్ట్ ఎయిడ్ అండ్ అంబులెన్స్ సర్వీసు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆలయ కమిటీ అధికారులు. భక్తులు ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరారు.