
ఢిల్లీలో మహిళలు ,ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడానికి 'సహేలీ స్మార్ట్ కార్డ్' పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న పింక్ టికెట్ విధానానికి ఇది ప్రత్యామ్నాయం. ఢిల్లీలో మహిళల భద్రత, ప్రయాణ సౌలభ్యం, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ DTC, క్లస్టర్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ పథకం 2019 అక్టోబర్ 29న ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఉచిత ప్రయాణం కోసం 'పింక్ టికెట్' స్థానంలో 'సహేలీ స్మార్ట్ కార్డ్' ని ప్రవేశపెట్టారు.
సహేలీ స్మార్ట్ కార్డ్ అనేది ఢిల్లీలోని 12 యేళ్లు అంతకంటే వయస్సు ఉన్న మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూపొందించిన డిజిటల్ పాస్. ఇది నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) ఫ్రేమ్‌వర్క్ కింద జారీ చేస్తున్నారు. ఈ కార్డు పొందాలంటే ఢిల్లీ అడ్రెస్ కు సంబంధించిన ఏదేని ఫ్రూఫ్ ఉండాలి.
సహేలీ స్మార్ట్ కార్డుతో DTC ,క్లస్టర్ బస్సులలో ఉచితంగా ప్రయాణించొచ్చు. కార్డ్‌లో దరఖాస్తుదారు పేరు ,ఫోటో ఉంటుంది. కార్డును ఉపయోగించే ముందు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) ద్వారా యాక్టివేట్ చేసుకోవాలి. ఈ కార్డ్‌ని రీఛార్జ్ చేసుకుని ఇతర రవాణా మార్గాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఉచిత ప్రయాణ ప్రయోజనం కేవలం DTC ,క్లస్టర్ బస్సులకు మాత్రమే పరిమితం.
ALSO READ | ఆర్థిక వ్యవస్థ బాగుపడితే పురుషులకు కూడా ఫ్రీ బస్సు : ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారి
ముందుగా దరఖాస్తుదారులు DTC పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత, ఖాతా ఉన్న బ్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి KYC ప్రక్రియను పూర్తి చేయాలి.
KYC పూర్తయిన తర్వాత బ్యాంక్ కార్డ్‌ను రిజిస్టర్ చేసిన చిరునామాకు పోస్ట్ ద్వారా పంపుతుంది.ఇందుకోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఢిల్లీ నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ KYC మార్గదర్శకాల ప్రకారం అవసరమైన ఏవైనా అదనపు పత్రాలు ఉంటే చాలు.
ప్రభుత్వం ప్రయాణికుల నుండి ప్రయాణానికి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయదు. అయితే కార్డ్‌ను జారీ చేసే బ్యాంకులు వారి విధానాల ప్రకారం నామమాత్రపు కార్డ్ జారీ లేదా నిర్వహణ ఫీజును వసూలు చేస్తాయి.
ఈ సహేలీ స్మార్ట్ కార్డుతో ఢిల్లీలో మహిళలు ,ట్రాన్స్‌జెండర్లకు సురక్షితమైన, సులభమైన, పేపర్‌లెస్ పబ్లిక్ రవాణాను అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.