దేశంలోని స్కూల్స్ పిల్లలను పేదలుగా మారుస్తున్నాయా..: సోషల్ మీడియాలో చర్చ ఎందుకు..?

దేశంలోని స్కూల్స్ పిల్లలను పేదలుగా మారుస్తున్నాయా..: సోషల్ మీడియాలో చర్చ ఎందుకు..?

భారత విద్యా వ్యవస్థ బ్రిటీష్ కాలం నాటిది. ఇప్పటికీ ప్రపంచం వేగంగా ముందుకెళుతున్నా విద్యా సంస్కరణ విషయంలో మాత్రం భారత్ స్వాతంత్ర్యానికి ముందే నిలిచిపోయింది. ఇదంతా ఒట్టి మాటలు కాదు, మార్పు కావాలంటూ చాలా మంది మెుత్తుకుని చెబుతున్న నిజాలు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్.. సిలబస్ ఏదైనా పిల్లల్ని పేదలుగా మార్చేస్తున్నాయనేది నెట్టింట అసలు వాదన. తాజాగా భారత విద్యా వ్యవస్థపై అనలిస్ట్ కామెంట్స్ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. 

ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో స్కూల్స్ పిల్లలకు సంపదకు అవసరమైన సరైన స్కీల్స్ అందించటంలో పూర్తిగా విఫలం అవుతున్నాయని హైదరాబాదుకు చెందిన ఆర్థిక విశ్లేషకతుడు హార్థిక జోషి విమర్శించారు. స్కూల్స్ పిల్లలను భావి భారత వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దకుండా ఉద్యోగులను ఉత్పత్తికి కేంద్రాలుగా మారాయన్నారు. సాంప్రదాయంగా వస్తున్న ఆర్థిక విద్య ప్రజలను హాయిగా పేదలుగా ఉండేలా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు జోషి.

ప్రస్తుతం ఉన్న స్కూల్స్ పిల్లలకు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సురక్షితంగా ఎలా ఉండాలి.. రూల్స్ ఫాలో అవుతూ ఎలా బతకాలనే విషయాలను మాత్రమే నేర్పిస్తోందన్నారు. సంపదను ఎలా సృష్టించాలి, నలుగురికి ఎలా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించాలనే స్కిల్స్ నేర్పించటం లేదన్నారు. వడ్డీ లెక్కల కోసం పొదుపు, బడ్జెటింగ్ అంశాలు నేర్పించే స్కూల్స్.. అసలైన ఇన్వెస్ట్మెంట్, ఎంటర్ ప్రెన్యూర్షిప్, నెగోషియేషన్ స్కిల్స్ అందించటంలో విఫలం అవుతున్నాయని అన్నారు జోషి.

అసలైన వెల్త్ బిల్డింగ్ రిస్క్ ను అర్థం చేసుకోవటంలోనే ఉంటుందని జోషి చెబుతున్నారు. రిస్క్ తప్పించుకోవటానికి కంఫర్ట్ జోన్లలో జీవించటానికి చేసే పనులు జీవితంలో ఎదగటానికి అవరోధాలుగా మారతాయన్నారు. ప్రజలు తమకోసం డబ్బు పనిచేసేలా చేయాలి కానీ.. ప్రతినెల ఈఎంఐలు, బిల్లులు కట్టడానికి మాత్రమే డబ్బు సంపాదించేలా బ్రతక్కూడదని జోషి సూచించారు. అసలు యజమానిలా ఆలోచించేలా స్కూలింగ్ లేదని.. ఏది చదివితే ఏ ఉద్యోగం వస్తుంది, దానికి ఎంత జీతం ఇస్తారు అనే బానిస ధోరణిని మాత్రమే స్కూల్స్ నేర్పిస్తున్నాయని జోషి చెప్పారు. 

ALSO READ : అర్చిత ఫుకాన్ ఎవరు? కెండ్రా లస్ట్ 'డీల్'తో చరిత్ర సృష్టిస్తుందా?

అసలు వస్తున్న ఆదాయాన్ని ఎలా ఉపయోగించాలి. దాని దేనికి ఎంత అలకేట్ చేయాలి, ఎంత దాయాలి.. దాస్తే ఎక్కడ ఎలా దాయాలి అనే విషయాలను ఫైనాన్షియల్ లిటరసీ కింద నేర్చుకోవాలన్నారు. దీనిని విస్మరించి స్వేచ్ఛగా వచ్చిన జీతంతో జీవితం గడిపే విధంగా తీర్చిదిద్దటం మానేయాలని జోషి అభిప్రాయపడ్డారు. కేకు కొనుక్కోవటం కాదు బేకరీకి ఓనర్ ఎలా అవ్వాలనే ఆలోచన వచ్చే స్థాయికి విద్య మారాలన్నారు.