
భారతీయ సోషల్ మీడియా ప్రపంచంలో ప్రస్తుతం అర్చిత ఫుకాన్ పేరు మార్మోగుతోంది. ముఖ్యంగా ఆమె ప్రముఖ అంతర్జాతీయ అడల్ట్ స్టార్ కెండ్రా లస్ట్తో కలిసి చేస్తున్నట్లుగా వస్తున్న ఒక 'డీల్' వార్త, సినీ, డిజిటల్ రంగాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సహకారం కేవలం ఒక సాధారణ కలయిక కాదని, భారతీయ కంటెంట్ క్రియేటర్ల పాలిట ఒక మల్టీ-కోట్ల రూపాయల డిస్ట్రప్టర్ కావచ్చని నెటిజన్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అర్చిత ఫుకాన్ ఎవరు?
అర్చిత ఫుకాన్ను ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ 'బేబీడాల్ ఆర్చి'తో ఎక్కువగా గుర్తిస్తారు. ఆమె అస్సాంకు చెందిన ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. కేట్ లిన్ పాడిన "డేమ్ అన్ గ్రర్" పాటపై ఆమె చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్ కావడంతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఈ రీల్ లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా, చాలా మంది క్రియేటర్లకు స్ఫూర్తినిచ్చింది. ఆమె బోల్డ్ కంటెంట్, స్టైలిష్ వీడియోలు, ఆకర్షణీయమైన ట్రాన్సిషన్స్‌తో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
గడ్డు కాలాన్ని ఎదుర్కొని బయటపడిన వ్యక్తిగా..
అయితే, అర్చిత ఫుకాన్ కేవలం ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు, ఆమె ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొని బయటపడిన వ్యక్తి. 2023 జులైలో ఆమె తన గతం గురించి ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బహిరంగంగా వెల్లడించారు. భారతదేశంలో ఆరేళ్ల పాటు బలవంతపు వేశ్యావృత్తిలో చిక్కుకుపోయానని, దాదాపు రూ. 25 లక్షలు చెల్లించి ఆ చీకటి ప్రపంచం నుండి బయటపడ్డానని ఆమె పేర్కొన్నారు. ఈరోజు "నా భయంకరమైన గతాన్ని తిరిగి చూసుకుంటే, నేను బతికి బయటపడిన వ్యక్తిగా నిలబడి ఉన్నాను. ఆశ, పట్టుదల, మానవ ఆత్మ యొక్క శక్తి చీకటి పరిస్థితులను కూడా ఎలా జయించగలదో దీనికి నిదర్శనం. ఒక నమ్మకమైన స్నేహితుని , నాలాంటి బాధితులకు సహాయం చేయడానికి అంకితమైన ఒక సంస్థ అకుంఠిత మద్దతుతో, నేను మరో 8 మంది అమ్మాయిలు, మహిళలను విముక్తి చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వగలిగాను. నిజంగా ఇది ఆనందమే అంటూ చెప్పుకొచ్చారు...
కెండ్రా లస్ట్ 'డీల్' ఎందుకు సంచలనం?
అర్చిత ఫుకాన్, కెండ్రా లస్ట్తో కలిసి కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. కెండ్రా లస్ట్ అంతర్జాతీయ అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ, అనుభవజ్ఞురాలైన వ్యక్తులలో ఒకరు. దీంతో అర్చిత ఫుకాన్ , లస్ట్ కలిసి పనిచేయబోతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దానికి ఊతం ఇచ్చేలా గత కొన్ని రోజులుగా ఒకరినొకరు ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లలో ట్యాగ్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా అడల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికి లస్ట్ తనకు సహాయం చేస్తోందని అన్నట్లు పోస్ట్ చేసింది.
ALSO READ : ఈ వారం (జూలై 7-13) థియేటర్/ఓటీటీల్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్లివే
మర్చిపోలేని అనుభూతి అంటూ పోస్ట్..
"కెండ్రాని మొదటిసారి కలవడం నిజంగా మర్చిపోలేని అనుభూతి! ఆమె ఆత్మవిశ్వాసం, వృత్తి నైపుణ్యం, విజయం నన్ను ఎంతగానో ప్రేరేపించాయి. ఆమె ఎంతో ఆత్మీయంగా, ప్రోత్సాహంగా మాట్లాడారు. మెరుగైన జీవితం వైపు నా ప్రయాణంలో నాకు ఉపయోగపడే విలువైన సూచనలు పంచుకున్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తితో కలిసి, ఆమె నుండి నేర్చుకునే అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞురాలిని" అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. ఊహాగానాలకు తెరలేపింది. అయితే ఈ డీల్ వార్తపై అధికారికంగా ఇద్దరూ దీనిపై ధృవీకరించనప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త చర్చకు దారితీసింది.