Upcoming Movies: ఈ వారం (జూలై 7-13) థియేటర్‌/ఓటీటీల్లో ఇంట్రెస్టింగ్‌ సినిమాలు, సిరీస్లివే

Upcoming Movies: ఈ వారం (జూలై 7-13) థియేటర్‌/ఓటీటీల్లో ఇంట్రెస్టింగ్‌  సినిమాలు, సిరీస్లివే

ఈ వారం (జూలై 7-13) ఓటీటీ/థియేటర్ లలో సినిమాల సందడి నెలకొంది. ఈ జూలై సెకండ్ వీక్.. థియేటర్స్లో చిన్న సినిమాలదే హవా కనిపిస్తోంది. అందులో తెలుగు నుంచి 3 సినిమాలు, హాలీవుడ్, బాలీవుడ్ నుంచి చెరొక సినిమా ఉంది. అయితే, ఈ సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ఆడియన్స్ను పలకరించనున్నాయి.

ఈ క్రమంలోనే తామేం తక్కువ కాదంటూ.. థియేటర్కు ధీటుగా ఓటీటీ సైతం సినిమాలు పట్టుకొస్తుంది. ఏకంగా 30కి పైగా సినిమాలు, సిరీస్లు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో డిఫెరెంట్ జోనర్స్లో సినిమాలు, సిరీస్లు దర్శనమిస్తున్నాయి. ప్రైమ్, జీ5,నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజయ్యే ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.

థియేటర్ సినిమాలు:

ఓ భామ అయ్యో రామా:

సుహాస్‌‌‌‌ హీరోగా నటించిన మూవీ ‘ఓ భామ అయ్యో రామ’.రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌‌‌‌ పతాకంపై హరీష్‌‌‌‌ నల్ల నిర్మించారు. మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో టాలీవుడ్‌‌‌‌కు పరిచయం అవుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఇందులో ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. సున్నితమైన భావోద్వేగాలతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదంతో సినిమా తెరకెక్కింది. శుక్రవారం జూలై 11న రిలీజ్ కానుంది. 

 ‘ది 100’:

‘మొగలి రేకులు’సీరియల్ ఫేమ్ RK సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది హండ్రెడ్’.రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ కలిసి నిర్మించారు. జూలై 11న సినిమా విడుదల కానుంది.

‘వర్జీన్‌ బాయ్స్‌’:

గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా దయానంద్ తెరకెక్కించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’.రాజా దరపునేని నిర్మించారు. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌‌‌‌ ఇతర పాత్రలు పోషించారు. జూలై 11న సినిమా థియేటర్లో విడుదల కానుంది.

‘సూపర్‌మ్యాన్’:

సూపర్ హీరోస్‌ లో ‘సూపర్‌మ్యాన్‌’ ఫ్రాంఛైజీ ఒకటి. డేవిడ్ కోరెన్స్‌వెట్ టైటిల్ రోల్‌లో నటించాడు. జేమ్స్‌ గన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూలై 11న ఇంగ్లీష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ మూవీలో రాచెల్ బ్రోస్నాహన్ లూయిస్ లేన్‌గా మరియు నికోలస్ హౌల్ట్ విరోధి లెక్స్ లూథర్‌గా కూడా నటించారు.

‘మాలిక్‌’:

రాజ్‌కుమార్ రావు పోషించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘మాలిక్‌’.పుల్కిత్‌ దర్శకుడు. మానుషి చిల్లర్‌ కథానాయిక. బాలీవుడ్‌ హీరోయిన్ హ్యుమా ఖురేషీ ఇందులో ఓ స్పెషల్ సాంగ్ చిందేసింది. చీకటి అండర్‌వరల్డ్‌లో ఆశయం, మనుగడ మరియు విముక్తి వంటి మోటివ్తో రానుంది. జూలై 11న రానుంది.

ఓటీటీ సినిమాలు:

జీ5:

భైరవం (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా)-జూలై 18

సోనీలివ్‌:

నరివెట్ట (తెలుగు డబ్బింగ్ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్)- జూలై 11

జియో హాట్‌స్టార్‌:

మూన్‌‌వాక్‌ (తెలుగు డబ్బింగ్ మలయాళం డ్రామా)- జూలై 8

రీఫార్మ్‌డ్‌ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 9

ద రియల్‌ హౌస్‌వైఫ్స్‌ ఆఫ్‌ ఆరెంజ్‌ కంట్రీ సీజన్‌ 19 (అమెరికన్ రియాలిటీ షో)- జూలై 10

స్పెషల్‌ OPS సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై ఇన్వెస్టిగేటివ్ వెబ్‌ సిరీస్‌)- జూలై 11

బరీడ్‌ ఇన్‌ ద బ్యాక్‌యార్డ్‌ సీజన్‌ 6 (ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ)- జూలై 13

అమెజాన్‌ ప్రైమ్‌:

కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్)- జూలై 8

బల్లార్డ్‌ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్‌ సిరీస్‌)- జూలై 9

SUN NXT:

కలియుగం 2064 (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ )- జూలై 11

కర్కి (కన్నడ థ్రిల్లర్ డ్రామా)- జూలై 11

నెట్‌ఫ్లిక్స్‌:

ట్రైన్‌రెక్: ది రియల్‌ ప్రాజెక్ట్‌ ఎక్స్‌ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- జూలై 8

అండర్‌ ఎ డార్క్‌ సన్‌ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌)- జూలై 9

జియామ్‌ (థాయి సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్)- జూలై 9

ది గ్రింజో హంటర్స్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్)- జూలై 9

బిల్డింగ్ ది బ్యాండ్ (ఇంగ్లీష్ రియాలిటీ మ్యూజిక్ కాంపిటీషన్ షో)- జూలై 9

బెటర్ లేట్ దాన్ సింగిల్ (కొరియన్ డేటింగ్ రియాలిటీ షో)- జూలై 9

సెవెన్‌ బియర్స్‌ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్‌ ఫాంటసీ)- జూలై 10

టూ మచ్‌ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 10

బ్రిక్‌ (అమెరికన్ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్)- జూలై 10

ఏ బ్రదర్‌ అండ్‌ 7 సిబ్లింగ్స్‌ (ఇండోనేషియన్ ఫ్యామిలీ ఎమోషనల్)- జూలై 10

8 వసంతాలు (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా)- జూలై 11

ఆప్‌ జైసే కోయ్‌ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డ్రామా)- జూలై 11

మడియాస్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ (అమెరికన్ కామెడీ ఫిల్మ్)- జూలై 11

ఆల్మోస్ట్ కాప్స్‌ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ)- జూలై 11

బుక్‌ మై షో:

గుడ్‌ వన్‌ (హాలీవుడ్‌ డ్రామా)- జూలై 8

పాల్‌ అండ్‌ పాలెట్‌ టేక్‌ ఏ బాత్‌ (ఇంగ్లీష్ రొమాంటిక్)- జూలై 11

లయన్స్‌గేట్ ప్లే: 

మిస్టర్‌ రాణి (తెలుగు డబ్బింగ్ కన్నడ కామెడీ)- జూలై 11

ఫోర్‌ ఇయర్స్‌ లేటర్‌ (ఆస్ట్రేలియన్-ఇండియన్ రొమాంటిక్ డ్రామా)- జూలై 11

ద సైలెంట్‌ అవర్‌ (ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్లిల్లర్)- జూలై 11

జాస్‌@50: ది డెఫినిటివ్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- జూలై 11

ఇందులో 8 వసంతాలు, భైరవం తెలుగులో ఒరిజినల్ మూవీస్గా వచ్చాయి. నరివెట్ట, కలియుగం, మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్, కరాటే కిడ్: లెజెండ్స్, కర్కి, మిస్టర్‌ రాణి, స్పెషల్‌ ఓపీఎస్‌ సీజన్ 2, మూన్‌వాక్, జియామ్‌ సినిమాలు సైతం తెలుగు స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉన్నాయి. ఇలా ఈ మొత్తం ఓటీటీ లిస్ట్ లో 8కి పైగా తెలుగు సినిమాలున్నాయి.

  • Beta
Beta feature
  • Beta
Beta feature
  • Beta
Beta feature