రాయలసీమ టెండర్లపై 24న విచారిస్తాం: హైకోర్టు

రాయలసీమ టెండర్లపై 24న విచారిస్తాం: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కార్ రాయలసీమ లిఫ్ట్ స్కీంకు టెండర్లను ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ ఫైల్ అయిన రెండు పిటిషన్లపై ఈ నెల 24న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదంపై విచారణ చేపట్టలేమని డివిజన్ బెంచ్ తొలుత చెప్పింది. అయితే వివాద కోణంలో తాము పిటిషన్లు వేయలేదని, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ను ఉల్లంఘించడంపైనే రిట్లు వేశామని పిటిషనర్ల తరఫు లాయర్ కె.శ్రవణ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఆ చట్టంలోని సెక్షన్‌ 84ను ఏపీ ఉల్లంఘించడం పైనే రిట్‌ వేశామని, దీనిపై హైకోర్టు విచారణ చేపట్టవచ్చని వివరించారు. దీంతో ఈ నెల 24న విచారిస్తామని జస్టిస్‌ ఎమ్మె స్‌ రాంచందర్ రావు, జస్టిస్‌ టి.అమర్ నాథ్ డ్‌ల డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. ఏపీ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, నారాయణపేట జిల్లాకు చెందిన జి.శ్రీనివాస్‌ రిట్ పిటిషన్లు ఫైల్ చేశారు.