గరిడేపల్లి, వెలుగు: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని రాయినిగూడెం నూతన సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాయినిగూడెం గ్రామ సర్పంచ్‌గా గుండు రామంజి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కొత్త సర్పంచ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు పరచేందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
