ఆర్బీఐ నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్

ఆర్బీఐ నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ 2020–21 ను ప్రభుత్వం ఈ నెల 20 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వం తరపున ఆర్‌‌బీఐ వీటిని ఇష్యూ చేస్తుంది. ‘రిజర్వ్‌ బ్యాంక్ తో కలిసి ప్రభుత్వం సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఇష్యూ చేయనుంది. ఈ బాండ్ల ఇష్యూ ఆరు విడతల్లో ఉంటుంది’ అనిఆర్‌‌బీఐ ఓ స్టేట్‌ మెంట్‌లో పేర్కొంది. ఈ బాండ్ల ఇష్యూ ఏప్రిల్‌, 2020 నుంచి సెప్టెంబర్‌‌, 2020వరకు ఉంటుందని తెలిపింది. ఈ బాండ్లను వివిధ సైజుల్లో ఇష్యూ చేస్తారు. బేసిక్‌ సైజు 1 గ్రాము. వీటి పీరియడ్‌ ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ఎగ్జిట్‌అయ్యే అవకాశం ఉంటుం ది. ఈ బాండ్లను కేవలం రెసిడెంట్‌ ఇండివిడ్యు వల్స్‌, హిందు అన్‌డివైడెడ్‌ఫ్యా మీలీస్‌(హెచ్‌యూఎఫ్‌), ట్రస్ట్‌లు, యూనివర్శిటీలు, సేవా సంస్థలకు మాత్రమే విక్రయించనున్నామని ఆర్‌‌బీఐ పేర్కొంది.

కనీసం ఒక గ్రాము గోల్డ్‌ కోసం ఇన్వెస్ట్‌ చేయాలని తెలిపింది. గరిష్టంగా ఇండివిడ్యువల్స్‌ 4 కేజీలు, హెచ్‌యూఎఫ్ లు 4 కేజీలు,ట్రస్ట్‌లు, యూనివర్శిటీలు, సేవా సంస్థలు 20 కేజీలవరకు సబ్‌స్క్రిప్షన్‌ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లకు ఏడాదికి2.50 శాతం చొప్పున ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ఈ వడ్డీని ఆరు నెలకొకసారి చెల్లిస్తారు. మొదటి విడతసావరిన్ గోల్డ్‌ బాండ్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల 20 న ప్రారంభమై 24 న ముగుస్తుంది. ఈ నెల 28 న బాండ్లను ఆర్‌‌బీఐ ఇష్యూ చేయనుంది. చివరి విడత అగష్టు 31నుంచి సెప్టెంబర్‌‌ 4 వరకు జరగనుందని ఆర్‌‌బీఐ తెలిపింది. ఇండియన్‌ బులియన్‌ మార్కెట్‌ ప్రకటించిన 24 క్యారెట్ల గోల్డ్‌ ధరకు అనుగుణంగా ఇష్యూ ధర ఉంటుందని పేర్కొంది. బాండ్ల ఇష్యూకి మూడు రోజుల ముందు గల గోల్డ్‌ రేట్ల యావరేజిని ఆర్‌‌బీఐ పరిగణనలోకి తీసుకోనుంది. ఆన్‌లైన్‌ లేదా డిజిటల్‌ మోడ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ కోసం చెల్లించే వారికి ఇష్యూ ధరకంటే రూ. 50 తక్కువ వసూలు చేయనుంది.