RBI Confirms : Paytm QR, సౌండ్ బాక్స్, కార్డు మెషీన్లు అన్నీ పనిచేస్తాయి

RBI Confirms : Paytm QR, సౌండ్ బాక్స్, కార్డు మెషీన్లు అన్నీ పనిచేస్తాయి

Paytm ద్వారా చెల్లింపుల సేవలు మార్చి 15 తర్వాత కూడా ఎప్పటిలాగే సజావుగా పనిచేస్తాయని RBI తెలిపింది. Paytm  QR కోడ్, సౌండ్ బాక్స్, కార్డు మెషీన్ ఎప్పటిలాగే పనిచేస్తాయని RBI తన ఎక్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది.వినియోగదారులు, వ్యాపారులు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ సేవలను వినియోగించు కోవచ్చు. 

ఇంతకుముందు లాగే Paytm సేవలందించేందుకు One 97 communitons limited దాని నోడల్ ఖాతాను ఎస్క్రో ఖాతా తెరవడం ద్వారా యాక్సిస్ బ్యాంక్ కి మార్చింది.. Paytm Payment services Ltd (PPSL), OCL పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ.. దాని ప్రారంభం నుంచి ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ సేవలను వినియోగించుకుంటోంది. 

Paytm గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ చెల్లింపుల రంగంలో వినియోగదారులు, వ్యాపారులకు నమ్మకంతో సేవలందిస్తోంది. Paytm QR కోడ్, సౌండ్ బాక్స్ లేదా కార్డమెషీన్ ద్వారా ఎలాంటి అంతరాయం లేని చెల్లింపులకోసం Paytm  పై ఆధారపడుతున్నారు.  వీధి వ్యాపారులు, చిన్న దుకాణాల నుంచి మాల్స్ వరకు Pay tm ఉత్పత్తులైన Paytm QR, Paytm సౌండ్ బాక్స్, Paytm కార్డు మెషీన్లు ప్రతిచోటా కనిపిస్తాయి. Paytm వినూత్న మొబైల్ చెల్లింపులతో  డిజిటల్ ఎకానమీలో వృద్ధిలో సహాయపడుతుంది.