పేటీఎంపై రిస్ట్రిక్షన్లు మార్చి 15 తర్వాతనే .. డెడ్‌‌‌‌‌‌‌‌లైన్ పొడిగించిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ

పేటీఎంపై రిస్ట్రిక్షన్లు మార్చి 15 తర్వాతనే .. డెడ్‌‌‌‌‌‌‌‌లైన్ పొడిగించిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ

న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌పై విధించిన రిస్ట్రిక్షన్ల అమలు డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ను ఫిబ్రవరి 29 నుంచి   మార్చి 15 కి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ) పొడిగించింది.  కస్టమర్లు  వాలెట్లు, ఫాస్టాగ్‌‌‌‌‌‌‌‌, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు, ప్రీపెయిడ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రమెంట్లలో డిపాజిట్‌‌‌‌‌‌‌‌ లేదా క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, టాప్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌లు చేసుకోవడానికి  మార్చి 15 తర్వాత  అనుమతి లేదని పేర్కొంది. రిఫండ్‌‌‌‌‌‌‌‌లు, క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌లు వంటివి మాత్రం కస్టమర్ల అకౌంట్లలో ఎప్పుడైనా యాడ్ అవుతాయని తెలిపింది.

కస్టమర్లు, మర్చంట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఇతర బ్యాంకులకు షిఫ్ట్ అవ్వడానికి, ఆల్టర్నేటివ్ మార్గాలు చూసుకోవడానికి  తాజాగా డెడ్‌‌‌‌‌‌‌‌లైన్ పొడిగించామని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వెల్లడించింది. ఈ ఇష్యూకి సంబంధించి ప్రీక్వెంట్లీ ఆస్క్డ్‌‌‌‌‌‌‌‌ క్వశ్చన్స్‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఏక్యూ) ను  రిలీజ్ చేసింది. మరోవైపు ట్రాన్సాక్షన్లకు అంతరాయం కలగకుండా ఉండేందుకు పేటీఎం తన నోడల్ అకౌంట్‌ను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు షిఫ్ట్ చేసింది. 

ఆర్‌‌బీఐ ఎఫ్‌ఏక్యూలో కొన్ని సమాధానాలు..

1. ఫండ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, భారత్ బిల్లు పేమెంట్‌‌‌‌‌‌‌‌, యూపీఐ ఫెసిలిటీ మినహా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అందించే  ఎటువంటి బ్యాంకింగ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు కూడా మార్చి 15 తర్వాత  ఉండవు.

2. సేవింగ్స్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌, కరెంట్ అకౌంట్‌‌‌‌‌‌‌‌, ఫాస్టాగ్‌‌‌‌‌‌‌‌ వంటి ప్రీపెయిడ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రుమెంట్లలో బ్యాలెన్స్ ఉండిపోతే  డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ తర్వాత కూడా కస్టమర్లు విత్‌‌‌‌‌‌‌‌డ్రా లేదా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసుకోవచ్చు. ఇందుకోసం డెబిట్ కార్డ్ కూడా వాడుకోవచ్చు. 

3. మార్చి 15 తర్వాత రిఫండ్స్‌‌‌‌‌‌‌‌, క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌లు, వడ్డీలు పడేవి ఉంటే అవి కస్టమర్ల అకౌంట్లలో యాడ్ అవుతాయి. 

4.  పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌ను శాలరీ అకౌంట్‌‌‌‌‌‌‌‌గా మెయింటైన్ చేస్తే మార్చి 15 తర్వాత ఇటువంటి అకౌంట్లలో శాలరీ పడదు.

5. ప్రభుత్వ సబ్సిడీలు కూడా అకౌంట్లలో పడవు.

6. ఓటీటీ మంత్లీ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్, ఎలక్ట్రిసిటీ బిల్లు వంటి వాటి కోసం  ఆటోమెటిక్ డెబిట్‌‌‌‌‌‌‌‌ ఉంటే అకౌంట్లలో బ్యాలెన్స్ ఉన్నంత వరకు మనీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి.  

7. పేటీఎం బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌కు లింక్ కాకుండా ఉంటే మర్చంట్లు తమ పేటీఎం క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌, పేటీఎం సౌండ్ బాక్స్‌‌‌‌‌‌‌‌ లేదా పేటీఎం పీఓఎస్‌‌‌‌‌‌‌‌ టెర్మినల్స్ ద్వారా డబ్బులు పొందడానికి అడ్డు లేదు.  మార్చి 15 తర్వాత కూడా వీరు ప్రస్తుతం ఫాలో అవుతున్న విధానాన్ని కొనసాగించొచ్చు.  అదే  పేటీఎం క్యూఆర్ కోడ్ స్కానింగ్, పీఓఎస్‌‌‌‌‌‌‌‌ల వంటి వాటి  ద్వారా వచ్చే డబ్బులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో యాడ్ అవుతుంటే మాత్రం మార్చి 15 తర్వాత ఇవి ఆగిపోతాయి. ఫండ్స్ ఈ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో  యాడ్ కావు. 

ఫాస్టాగ్‌‌‌‌‌‌‌‌ నుంచి పేటీఎం ఔట్‌‌‌‌‌‌‌‌.. 

హైవేల్లో టోల్ కలెక్ట్ చేస్తున్న  ప్రభుత్వ సంస్థ ఇండియన్ హైవేస్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ  పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ తీసుకోవద్దని  యూజర్లకు సలహా ఇచ్చింది.  మిగిలిన 32 అథరైజ్డ్ బ్యాంకుల నుంచి ఫాస్టాగ్‌‌‌‌‌‌‌‌ కొనుక్కోవాలని వెల్లడించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్‌‌‌‌‌‌‌‌లను ఇష్యూ చేయడాన్ని ఆపేసింది.  ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రావెల్ చేయాలంటే  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, అలహాబాద్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఐడీబీఐ బ్యాంక్, పీఎన్‌‌‌‌‌‌‌‌బీ, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ, యెస్ బ్యాంక్ వంటి 32 అథరైజ్డ్ బ్యాంకుల నుంచి ఫాస్టాగ్ కొనుక్కోవాలని యూజర్లకు సలహా ఇచ్చింది. దేశంలో 8 కోట్ల ఫాస్టాగ్ యూజర్లు ఉన్నారని, ఇందులో  పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ వాటా 30 శాతం ఉందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఏఐ) సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.