రివర్స్ రెపోరేటు 0.25 శాతం తగ్గించిన ఆర్ బీఐ

రివర్స్ రెపోరేటు 0.25 శాతం తగ్గించిన ఆర్ బీఐ
  • నాబార్డు, ఎస్ఐడీబీఐ, ఎన్ హెచ్ బీలకు 50 వేల కోట్లు
    బ్యాంకుల్లో నిధుల కొరత లేదన్న శక్తికాంత దాస్

    ముంబై: దేశంలో కరోనా పరిస్థితిని గమనిస్తున్నామని, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బ్యాంకుల్లో నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. రివర్స్ రెపోరేటును 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. రెపో రేటును 15 ఏళ్ల కనిష్ఠ స్థాయి 4.40 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా దేశంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. రీజినల్ రూరల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, మైక్రోఫైనాన్స్ సంస్థలకు రీఫైనాన్స్ కోసం నాబార్డ్ కు రూ.25 వేల కోట్లు, ఎస్ఐ డీబీఐకి రూ.15 వేల కోట్లు, ఎన్ హెచ్ బీకి 10 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు. కమర్షియల్ బ్యాంకుల లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్సీఆర్) ను వంద శాతం నుంచి 80 శాతానికి తగ్గిస్తామన్నారు. 2021 ఏప్రిల్ నాటికి దశలవారీగా దీన్ని రీస్టోర్ చేస్తామని చెప్పారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్ బీఎఫ్ సీ)లు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చిన లోన్లపై కూడా మారటోరియం వర్తిస్తుందన్నారు. మారటోరియం సమయంలో బ్యాంకు లోన్లకు 90 రోజుల ఎన్పీ ఏ గడువు అప్లయ్ కాదని చెప్పారు.