టోకెనైజేషన్​ గడువు పొడిగింపు

టోకెనైజేషన్​ గడువు పొడిగింపు

ముంబై: కార్డుల టోకెనైజేషన్​ డెడ్​లైన్​ను రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) జూన్​ 30, 2022 దాకా పొడిగించింది. అంతకు ముందు డిసెంబర్​31, 2021 ని గడువుగా ఆర్​బీఐ నిర్ణయించింది. కానీ, పేమెంట్​ సంస్థలు, బ్యాంకులు, ఇండియన్​ బ్యాంక్స్​ అసోసియేషన్​ (ఐబీఏ)ల విజ్ఞప్తి మీద టోకెనైజేషన్​ డెడ్​లైన్​ను పొడగించారు. కార్డు ఇష్యూయర్లు కాని సంస్థలు ఏవీ కస్టమర్ల కార్డుల డేటాను తమ సర్వర్లలో స్టోర్​ చేయడానికి వీలులేదనే కొత్త నిబంధనను ఆర్​బీఐ అమలులోకి తెస్తోంది. దీనికి బదులుగా టోకెనైజేషన్​ ప్రాసెస్​ను లేదా మరేదైనా ఆల్టర్నేటివ్​ విధానాన్ని అమలు చేయాలని నిర్దేశించింది. కార్డు దారుల ప్రొటెక్షన్​ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్​బీఐ వివరించింది. కార్డ్​ ఆన్​ ఫైల్​ (సీఓఎఫ్​) రూల్​ అమలును మరో ఆరు నెలలు వాయిదా వేస్తున్నట్లు ఆర్​బీఐ ప్రకటించింది. సీఓఎఫ్​ రూల్​ అమలుకు ఇంకా తాము రెడీగా లేమని, మరి కొంత కాలం పడుతుందని మర్చంట్​ పేమెంట్స్​ అలయన్స్​ ఆఫ్​ ఇండియా (ఎంపీఏఐ), అలయన్స్​ ఆఫ్​ డిజిటల్​ ఇండియా ఫౌండేషన్​ (ఏడీఐఎఫ్​) వంటి సంస్థలు ఆర్​బీఐకి తెలియచేశాయి.