
నిబంధనలను పాటించలేదని ఆరోపిస్తూ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. ఆ బ్యాంకుకు సంబంధించి 39 ఖాతాల విషయంలో నో యువర్ కస్టమర్ (కెవైసీ) రూల్స్‌ను అతిక్రమించిందని కోటి రూపాయల జరిమానా విధించింది ఆర్‌బీఐ. ఆ ఖాతాలలో జరిపిన ట్రాన్సక్షన్స్, వారి ఇన్‌కమ్, ప్రొఫైల్‌కు సరితూగలేదని గుర్తించిన ఆర్బీఐ.. బ్యాంకు నిబంధనలు పాటించలేదని తెలిపింది. అందుకు కోటీ రూపాయల జరిమానా విధిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు నోటీసులిచ్చింది. సెక్షన్ 47 ఎ (1) (సి) బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లోని సెక్షన్ 46 (4) (ఐ) ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.