
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ ఆరు శాతం ఉండొచ్చు
- క్యూ4లో ద్రవ్యోల్బణం 6.5 శాతం ఉంటుందని అంచనా
న్యూఢిల్లీ: నెమ్మదించిన ఎకానమీని పరుగులు పెట్టించడానికి ఆర్‌బీఐ మరిన్ని ప్రయత్నాలను మొదలుపెట్టింది. జీడీపీ, డిమాండ్ తగ్గడం, లిక్వి డిటీకి కొరత ఏర్పడటం వల్ల ఎకానమీకి ఇబ్బంది కలుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సెక్టార్లకు బ్యాంకు లోన్లను పెంచడం, చెక్కుల లావాదేవీలను మరింత సులభతరం చేయడం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, జీడీపీ వృద్ధిరేటును పెం చడం వంటి కీలక నిర్ణయాలను ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ప్రకటించింది. ఈ నెల నాలుగో తేదీ నుంచి మూడు రోజులపాటు సమావేశమైన ఎంపీసీ సభ్యులు వడ్డీరేట్లను మార్చలేదు. రెపోరేట్లను, రివర్స్ రెపోరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటిం చారు. రెపో రేటు యథాతథంగా 5.15 శాతం, రి వర్స్ రెపోరేటు 4.90 శాతం కొనసాగుతుంది. అంతకుముందు వరుసగా ఐదుసార్లు వడ్డీరే ట్లను 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నం దున వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచుతుందని పలువురు ఎకానమిస్టులు అంచనా వేశారు. రిటైల్ ద్రవ్యోల్బణం గత డిసెంబరులో ఏకంగా 7.4 శాతానికి పెరిగింది. 2014 జూలై తరువాత ఇదే అత్యధికం. ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా రెండంకెలకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చి వరి క్ వార్టర్ రిటైల్ ద్రవ్యోల్బణం 6.5 శాతం ఉంటుం దని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఎంపీసీ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇలా ఉన్నాయి .
రియల్ ఎస్టేట్ కు మరిన్ని లోన్లు
రియల్ ఎస్టేట్ సెక్టార్ అభివృద్ధి కోసం కమర్షియల్ బ్యాంకు లకు క్ యాష్ రి జర్వ్ రే షియో (సీఆర్‌ఆర్) రూల్స్ ను సులభతరం చేస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఇవి నాలుగు శాతం ఉంటే చాలని తెలిపింది. దీనివల్ల రియల్టీ, ఆటో, ఎంఎస్ ఎంఈల వంటి వాటికి మరిన్ని బ్యాంకు లోన్లు వస్తాయి . దీంతో గురువారం రియల్టీ స్టాక్స్ దూసుకెళ్లాయి . ‘‘బ్యాంకు లకు మరిన్ని లోన్లు ఇవ్వడం చాలా మంచి పరిణామం. అనివార్య పరిస్ థితుల వల్ల నిలిచి పోయిన ప్రాజెక్టులు తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి . దీనివల్ల డె వెలపర్లకు ఎంతో మేలు జరుగుతుంది’’ అని జేఎల్ ఎల్ ఇండియా సీఈఓ రమేశ్ నాయర్ అన్నారు . ఇండ్ల కొనుగోలుదారులకు సులభంగా లోన్లు వస్తాయని అన్నారు .
జీడీపీ లెక్కలు ఇలా..
కొత్త ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ ఆరు శాతం ఉండొచ్చని, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇది ఐదుశాతం రి కార్డు కావొచ్చని ఆర్ బీఐ తెలిపింది. చిన్న కంపెనీలకు మరింత మేలు చేయడానికి వన్ టైం రీస్ట్రక్చరింగ్ పథకాన్ని పొ డిగిం చాలని నిర్ణయించింది. జీఎస్టీ రి జిస్ట్రేషన్ ఉన్న కు టీర, చి న్న, మధ్యస్థాయి (ఎంఎస్ ఎంఈ) కంపెనీలకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుం ది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రకటించిన నిర్ణయాలు వృద్ధిని పెంచుతాయని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. కార్పొరే ట్ ట్యాక్స్ ల తగ్గిం పుతోనూ ఎకానమీకి మేలు జరుగుతుందని తెలిపింది. మార్కెట్లకు బూస్ట్‌ఆర్‌బీఐ ప్రకటన ఈక్విటీ మార్కె ట్లలో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్ 163 పెయింటు పెరిగి 41,306.03 వద్ద ముగిసింది. నిఫ్టీ 48.80 పాయింట్ లు పెరిగి 12,137.95 వద్ద ముగిసింది. ఆటో, రి యల్టీ, ఎస్ ఎంఎస్ ఈలకు బ్యాంకులు మరింత ఈజీగా లోన్లు ఇచ్చేలా ఆర్‌బీఐ రూల్స్ ను మార్చడంతో ఇన్వెస్టర్లు పాజిటివ్ గా స్పందించారు.
చెక్ ఇమేజ్ తోనే క్లియరెన్స్
చెక్కులను మరింత ఈజీగా విడిపిం చుకోవడానికి ఉపకరించే చెక్ ట్రంకేషన్ సి స్టమ్(సీ-టీఎస్) ను ఈ ఏడాది సెప్టెం బర్ లోపు అన్ని న గరాల్లోనూ అమలు చేస్తామని ఆర్ బీఐ ప్రకటించింది. ఈ విధానంలో చెక్ ను బ్యాంక్ బ్రాంచుల చుట్టూ తిప్పాల్సి న అవసరం సీటీఎస్‌తో ఉండదు. ప్రెజెంటింగ్ బ్యాంక్, క్లియరెన్స్ హౌస్ ద్వారా చెక్ ఇమేజ్‌ను ఎలక్ట్రానిక్ మోడ్ లో పేయింగ్ బ్రాంచ్‌కు పంపిస్తుంది. దీనితో పాటు ఎంఐసీఆర్(మాగ్నెటిక్ ఇంక్ కేరక్టర్ రి కగ్నేషన్) బాండ్ డేటా, ప్రెజెంటేషన్ డేట్ వంటి ఇతర వివరాలను పంపిస్తుంది. ఈ సిస్టమ్ వలన చెక్ క్లి యరెన్స్ వేగంగా జరుగుతుంది. చెక్ ట్రంకేషన్ 2008 లో ఢిల్లీలో మొదటిసారి గా ప్రారంభమైం ది. ఆ తర్వాత ఈ పద్ధతిని ఇతర సిటీలకు కూడా విస్తరిస్తున్నారు.