రెపోరేటు పెంచిన ఆర్బీఐ..పెరగనున్న ఈఎంఐలు..

రెపోరేటు పెంచిన ఆర్బీఐ..పెరగనున్న ఈఎంఐలు..

అనుకున్నదే జరిగింది. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచింది. ద్రవ్యోల్భణాన్ని అదుపులోకి తెచ్చేందుకుగానూ రెపో రేటును పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ గత నెలలోనే రెపోరేట్ను 40 పాయింట్లు పెంచగా.. తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచారు. తాజా పెంపుతో కలుపుకుని రెపో రేటు 4.90 శాతానికి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెపో రేటును 5.5శాతానికి పెంచనున్నట్లు తెలుస్తోంది. కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లు పెంచే అవకాశముంది. దీంతో సామాన్యుడికి లోన్లు, ఇతర ఈఎంఐలు భారం మరింత పెరగనుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.2శాతంగా నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. కాగా ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్భణం 7.79శాతానికి చేరింది. జనవరిలో నమోదైన దానికంటే ఇది 6 శాతం ఎక్కువ కావడం గమనార్హం.