
ముంబై: ముంబై: రెపోరేటును మరోసారి స్థిరంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పాత రెపోరేటు5.50 శాతాన్ని కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో EMI చెల్లించే వారిపై భారం పడలేదు. రెపోరేటు పెరిగితే బ్యాంకులకు రుణ ఖర్చుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో EMI తగ్గలేదు..పెరగలేదు. రెపోరేటు తగ్గితే ఎంతో కొంత ఊరట ఉంటుందనుకున్న సామాన్యులకు పండుగ వేళ ఆర్బీఐ నిరాశపర్చింది.
RBI రెపో రేటులో మార్పులు రుణాలకు ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు ఉన్న వాటికి EMI ని నేరుగా ప్రభావితం చేస్తాయి. RBI రెపో రేటును పెంచినప్పుడు అది బ్యాంకులకు రుణ ఖర్చులను పెంచుతుంది. దీంతో రుణ వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఫలితంగా రుణగ్రహీతలకు EMIలు పెరుగుతాయి.
రెపో రేటు తగ్గితే బ్యాంకులకు రుణాలు ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా వడ్డీ రేట్లు తగ్గుతాయి,కస్టమర్లకు EMIలు తగ్గుతాయి. ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు ప్రభావం వారి రుణం వడ్డీ రేటు రకం,బ్యాంకర్ల విధానంపై ఆధారపడి ఉంటుంది. రెపో-లింక్డ్ రుణాలు సాధారణంగా త్వరగా మార్పులను ఉంటాయి.
బుధవారం (అక్టోబర్1) ఉదయం 2025–26 ఆర్థిక సంవత్సరానికి RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) నాల్గవ సమావేశం జరిగింది. రెపో రేటును స్థిరంగా ఉంచుతూ ద్రవ్యవిధాన కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది..ఫలితం రెపోరేటు 5.5శాతం, బ్యాంక్ రేటు 5.75శాతం వద్దనే ఉన్నాయి. అని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు.
రెపో రేటును స్థిరంగా ఉంచుతూ ద్రవ్యవిధాన కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది..ఫలితం రెపోరేటు 5.5శాతం, బ్యాంక్ రేటు 5.75శాతం వద్దనే ఉన్నాయి. అని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు.
#WATCH | On the Monetary Policy, RBI Governor Sanjay Malhotra says, "... The MPC voted unanimously to keep the policy repo rate unchanged at 5.5%. Consequently, the STF rate remains at 5.25%, while the MSF rate and the bank rate remain at 5.75%. The MPC also decided to continue… pic.twitter.com/b4JhDzlIoc
— ANI (@ANI) October 1, 2025
2025లో ప్రారంభంలో మూడుసార్లు రెపోరేటు తగ్గించిన తర్వాత ఆర్బీఐ రేట్లను మార్చకుండా స్థిరంగా ఉంచింది.. ఇది వరసగా రెండోసారి. ఫిబ్రవరి, ఏప్రిల్ లో 25 బేస్ పాయింట్లు, జూన్ లో 50 బేస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. తదర్వాత రేపురేటు 6.5 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గింది.
జీడీపీ అంచనా పెరిగింది..
2026 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధిని 6.8 శాతానికి అంచనా వేసింది ఆర్బీఐ ఎంపీసీ సమావేశం. ఇది గతంలో 6.5 శాతంగా ఉంది. అదే సమయంలో ద్రవ్యోల్బణ అంచనాను 3.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గించారు. ఇది దేశ ఆర్థిక శక్తి, ధరల స్థిరత్వాన్ని మెరుగుపడుతుందని చెప్పవచ్చు.
RBI ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో భారత మార్కెట్లు గ్రీన్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 0.36శాతం పెరిగి 80వేల555 కొనసాగుతోంది. నిఫ్టీ 0.28శాతం పెరిగి 24వేల683 ఉంది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.60శాతం పెరిగి 54వేల960 వద్ద ట్రేడవుతోంది.