భారత్ జీడీపీ 7.8 శాతం

భారత్ జీడీపీ 7.8 శాతం

2022 ఫిబ్రవరి 10న పద్నాలుగవ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2022–23 వార్షిక బడ్జెట్‌ ముఖ్యాంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ... 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.8 శాతంగా ఉంటుందన్నారు. అదే విధంగా రిపోరేటు, రివర్స్‌రిపో రేటులో ఎటువంటి మార్పు లేదని తెలిపారు.  ద్రవ్యలోటు, మూలధన ప్రణాళికలు, ప్రభుత్వ మార్కెట్‌ రుణ సమీకరణల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. ఇక డిజిటల్‌ రూపీని రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రీ పెయిడ్‌ వోచర్లుగా ఆర్బీఐ జారీ చేస్తుందని 

నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంటాయన్నారు. పప్పులు, వంట నూనె ధరల్లో ఉత్పత్తి పెరిగినందున ధరల పెరుగుదలకు కళ్లెం పడినట్లే అన్నారు ఆర్బీఐ గవర్నర్. గత నవంబరు నుంచి పెట్రోలు ధరలు పెంచకపోవడం వల్ల ధరల పెరుగుదలకు కొంత బ్రేక్‌ పడిందన్నారు. ఓమిక్రాన్‌ ప్రభావం క్యూ 3, క్యూ 4పై పెద్దగా లేదన్నారు.  కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి పరిమితం అవుతుందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవోల్బణం 5.7 శాతంగా ఉందన్నారు. ధరల పెరుగుదల అదుపులోకి వస్తుండటంతో ద్రవ్యోల్బణం తగ్గుతోందని శక్తికాంత్ దాస్ వివరించారు. కమర్షియల్‌ బ్యాంకుల పనితీరు మెరుగుపడుతోందన్నారు.