- రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం కంటే దిగువకు రావడమే కారణం
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ డిసెంబర్ 3–5 మధ్య జరిగే మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో బెంచ్‌మార్క్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. గత నెల కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్దేశించిన 2శాతం కనిష్ట పరిమితికి దిగువన (1.90 శాతంగా) ఉంది. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2)లో జీడీపీ వృద్ధి అంచనాలను మించి 8.2శాతంగా నమోదు కావడంతో ఆర్‌బీఐ రేట్లను స్థిరంగా ఉంచే అవకాశమూ ఉందని మరికొంతమంది ఎనలిస్టులు అంటున్నారు.
ఆర్‌బీఐ కిందటేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 100 బేసిస్ పాయింట్లు తగ్గించి, ఆగస్టులో 5.5శాతం వద్ద నిలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, క్రిసిల్ వంటి సంస్థలు ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం వల్ల రేటు తగ్గింపు అవకాశం ఉందని సూచించగా, రేటు మార్పు ఉండకపోవచ్చని బీఓబీ, ఇక్రా తెలిపాయి.
