
ముంబై: ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల కారణంగా.. ఈసారి రెపో, రివర్స్ రిపో రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. పాతరేట్లనే కొనసాగించవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. మరికొంత కాలం తరువాత రేట్ల మార్పు గురించి ఆలోచించాలని, ఇన్‌ఫ్లేషన్ తగించేలా, ఎకానమీ బలపడేలా రేట్లను మార్చాలని ఆర్‌బీఐ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఈ నెల 6–8 తేదీల్లో జరుగుతుంది. కొత్త రేట్ల గురించి ఎనిమిదో తేదీన ప్రకటిస్తారు. అక్టోబరులోనూ ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను మార్చలేదు. రేట్లను ఎంపీసీ మీటింగ్‌లోనే మార్చాలనే రూల్ ఏమీ లేదని, తరువాత మార్చుకోవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. రివర్స్ రిపో రేటును మార్చే అవకాశాలు ఉన్నాయని, అయితే ఇప్పుడే దీనిపై కచ్చితంగా నిర్ధారణకు రావడం కష్టమని తెలిపింది. ఒమిక్రాన్ గురించి స్పష్టమైన సమాచారం లేదు కాబట్టి రేట్లను మార్చే అవకాశాలు తక్కువేనని కోటక్ బ్యాంక్ ఎకనమిక్ రీసెర్చ్ రిపోర్టు పేర్కొంది.