ఎందుకీ డౌట్స్ : మళ్లీ వెయ్యి రూపాయల నోట్లు వస్తున్నాయా.. RBI ఏం చెబుతోంది..?

ఎందుకీ డౌట్స్ : మళ్లీ వెయ్యి రూపాయల నోట్లు వస్తున్నాయా.. RBI ఏం చెబుతోంది..?

వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా.. నోట్ల రద్దు సమయంలో వెయ్యి రూపాయల నోటును శాశ్వతంగా తొలగించి.. ఆ స్థానంలో 2 వేల నోటును తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ 2 వేల నోటు కూడా రద్దయ్యింది. చెలామణి నుంచి తొలగించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు కొత్తగా ఓ ప్రచారం జరుగుతుంది. వెయ్యి రూపాయల నోటు మళ్లీ వస్తుంది అని.. ఇందులో నిజమెంత.. ఎందుకీ ప్రచారం.. ఎక్కడి నుంచి మొదలైంది.. ఎందుకిలా జరుగుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానంగానే.. ఈ కథనం.. పూర్తి వివరాల్లోకి వెళితే..

రూ.2వేల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన తర్వాత వెయ్యి నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు విస్తృతమవుతున్నాయి. ఈ విషయంపై ఓ వార్త వైరల్ అవుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచనలో లేదని టాక్ వినిపిస్తోంది. రూ. 1000 నోటును మళ్లీ ప్రవేశపెట్టే అంశాన్ని ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకోలేదని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ ఏడాది మే 19న రూ.2వేల కరెన్సూ నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించి, నోట్ల మార్పిడికి దాదాపు నాలుగు నెలల గడువు ఇచ్చింది. తొలుత సెప్టెంబర్ 30 వరకు గడువు విధించగా, ఆ తర్వాత అక్టోబర్ 7 వరకు పొడిగించింది.

డీమోనిటైజేషన్

నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అవినీతి, నల్లధనంపై పోటాపోటీగా, ఉగ్రవాదాన్ని అరికట్టడమే లక్ష్యంగా దీన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అయితే, రూ.2,000 నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి రూ.1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. రూ.1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అంశాన్ని ఆర్‌బీఐ పరిగణించడం లేదని తాజాగా పలు వర్గాలు స్పష్టం చేశాయి.