నెఫ్ట్‌ ద్వారా 24×7 ఫండ్ ట్రాన్సుఫర్

నెఫ్ట్‌ ద్వారా 24×7 ఫండ్ ట్రాన్సుఫర్

ప్రభుత్వరంగ SBI నుంచి ప్రైవేట్ దిగ్గజం HDFC బ్యాంకు వరకు అన్ని బ్యాంకుల్లో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సుఫర్ (NEFT) ట్రాన్సాక్షన్స్ నిన్నటి(డిసెంబర్-16) నుంచి 24×7 అందుబాటులోకి వచ్చాయి. SBI, HDFC, యాక్సిస్ బ్యాంకు,ICICI సహా అన్ని కమర్షియల్ బ్యాంకుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. నిన్నటి నుంచి ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల.. ఏ సమయంలోనైనా నెఫ్ట్ ట్రాన్సుఫర్ ఉపయోగించుకోవచ్చు. సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ఏడాదిలో ప్రతి సమయంలోను అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెసులుబాటు కల్పించింది. NEFT ట్రాన్సాక్షన్ టైమింగ్స్ ఇదివరకు ఉదయం గం.8 నుంచి సాయంత్రం గం.6.30 వరకు ఉంది. ఇప్పుడు ఏ సమయంలోనైనా NEFT ద్వారా ట్రాన్సుఫర్ అంటే కస్టమర్లు పేమెంట్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది.  అంతేకాదు.. ఇప్పటి వరకు కేవలం బ్యాంకులు ఓపెన్ ఉన్న రోజునే అందుబాటులో ఉండగా, ఇప్పటి నుంచి ప్రతి రోజు రౌండ్ ది క్లాక్ ఉంటుంది. సెలవు రోజుల్లో, పండుగ సమయాల్లో బ్యాంకులు తెరిచే వరకు వేచి ఉండకుండా బదలీ చేసుకోవచ్చు.