HDFC ఖాతాదారులు ఆందోళన చెందవద్దు

HDFC ఖాతాదారులు ఆందోళన చెందవద్దు

కొత్త క్రెడిట్ కార్డుల జారీ, డిజిటల్-2లో భాగంగా ప్రవేశపెట్టనున్న డిజిటల్ సంబంధ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయాలన్న RBI ఆదేశాలపై HDFC స్పందించింది. 2 సంవత్సరాలుగా HDFCకి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్, చెల్లింపులు తదితర లావాదేవీల్లో అంతరాయాలు జరుగుతున్నాయి. నవంబర్ 21 బ్యాంక్ ప్రైమరీ డాటా సెంటర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ఇంటర్ నెట్ బ్యాంకింగ్, చెల్లింపుల్లో ఆటంకాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ బుధవారం ఆదేశాలు జారీ చేసిందని వివరణ ఇచ్చింది HDFC బ్యాంక్. పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది HDFC బ్యాంక్. రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావమూ ఉండదని చెప్పిన HDFC..ప్రస్తుతం కస్టమర్లకు అందుతున్న అన్ని సేవలూ యథావిధిగా అందబాటులో ఉంటాయంది. RBI సూచించిన లోపాలను సవరించిన తర్వాత ఈ ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పింది HDFC బ్యాంక్.