
మనీ ట్రాన్స్ ఫర్ యాప్ లకు ఆర్బీఐ ఝలక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన ఫోన్ పేతో పాటు పలు యాప్ లు, వెబ్ సైట్లపై జరిమానా విధించింది. పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్స్ 2007 చట్టం ప్రకారం జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. వొడాఫోన్‌కు చెందిన ఎం-పేసాకు రూ.3.05 కోట్లు, మొబైల్ పేమెంట్స్, ఫోన్‌పే, ప్రైవేట్ అండ్ జీఐ టెక్నాలజీ సంస్థలకు రూ.1 కోటి చొప్పున, వై-క్యాష్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది. అలాగే అమెరికా సంస్థలైన వెస్టర్న్ యూనియన్‌కు రూ.29,66 లక్షలు, మనీగ్రామ్‌కు రూ.10,11, జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.