రిలయన్స్ క్యాపిటల్ దివాలా

రిలయన్స్ క్యాపిటల్ దివాలా

న్యూఢిల్లీ: దేశంలో నంబర్ వన్‌ ధనవంతుడు ముఖేష్‌ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్ కంపెనీ దివాలా తీసింది. కంపెనీ బోర్డును రద్దు చేస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రకటించింది. చేసిన అప్పులు చెల్లించడంలో కంపెనీ విఫలం కావడంతో ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. ప్రాథమిక విచారణలో కంపెనీ నిర్వహణకు సంబంధించి కూడా అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దివాలా ప్రక్రియ త్వరలోనే ప్రారంభమౌతుందని ఆర్‌బీఐ పేర్కొంది.