పెరిగిన ఫారెక్స్ నిల్వలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన

పెరిగిన ఫారెక్స్ నిల్వలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన

న్యూఢిల్లీ: భారతదేశ విదేశీ మారక నిల్వలు మే 23తో ముగిసిన వారంలో 6.992 బిలియన్ డాలర్లు పెరిగి 692.721 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ) శుక్రవారం ప్రకటించింది. అంతకుముందు వారంలో (మే 16తో ముగిసిన వారం), మొత్తం నిల్వలు 4.888 బిలియన్ డాలర్లు తగ్గి 685.729 బిలియన్ డాలర్లకు చేరాయి. సెప్టెంబర్ 2024 చివరిలో ఈ నిల్వలు ఆల్-టైమ్ హై అయిన 704.885 బిలియన్ డాలర్లకు పెరిగిన విషయం తెలిసిందే.

మే 23తో ముగిసిన వారంలో, నిల్వలలో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 4.516 మిలియన్ డాలర్లు పెరిగి 586.167 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులలో యూరో, పౌండ్, యెన్ వంటి నాన్- యూఎస్ కరెన్సీలు కూడా ఉన్నాయి. బంగారం నిల్వలు ఈ వారంలో 2.366 బిలియన్ డాలర్లు పెరిగి 83.582 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌లు) 81 మిలియన్ డాలర్లు పెరిగి 18.571 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్‌‌‌‌లో మన రిజర్వ్ పొజిషన్ కూడా 30 మిలియన్ డాలర్లు పెరిగి 4.401 బిలియన్ డాలర్లకు చేరింది.