
న్యూఢిల్లీ: డిజిటల్ కరెన్సీని దశల వారీగా తెచ్చేందుకు ఆర్‌బీఐ పనిచేస్తోందని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రపోజల్స్ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ ఏడాది అక్టోబర్‌లో తమకు అందాయని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. ఆర్‌బీఐ చట్టం–1934 ను సవరించి ‘నోట్’ తో పాటు ‘డిజిటల్ కరెన్సీ’ అనే పదాన్ని కూడా చేర్చాల్సి ఉందని వివరించింది. మరోవైపు దేశంలో క్రిప్టో ఇండస్ట్రీని పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పార్లమెంట్‌లో ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ బిల్లును తీసుకురావాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ కామెంట్స్ చేయడం గమనించాలి. లోకల్, విదేశీ క్రిప్టో ఎక్స్చేంజి కంపెనీల నుంచి ఎటువంటి డేటాను సేకరించడం లేదని ఈ మినిస్ట్రీ పేర్కొంది.