దేశ ఆర్థిక పరిస్థితిపై ఆర్​బీఐ సమీక్ష 

దేశ ఆర్థిక పరిస్థితిపై ఆర్​బీఐ సమీక్ష 

ముంబై : అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ అస్థిరత వల్ల ఎదురవుతున్న సవాళ్లతో సహా దేశీయ ఆర్థిక పరిస్థితిపై ఆర్‌‌బీఐ సెంట్రల్ బోర్డు శుక్రవారం సమీక్షించింది.  2024–-25 అకౌంటింగ్ సంవత్సరానికి బ్యాంక్ బడ్జెట్‌‌ను కూడా బోర్డు ఆమోదించిందని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 607వ సమావేశం నాగ్‌‌పూర్‌‌లో గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగింది.  

ప్రస్తుత అకౌంటింగ్ సంవత్సరంలో (2023-–24లో) డిజిటల్ చెల్లింపులు, వినియోగదారుల విద్య , అవగాహనలో సాధించిన పురోగతితో సహా ఆర్​బీఐ కార్యకలాపాలను కూడా బోర్డు చర్చించింది. ఈ సమావేశానికి కేంద్ర బోర్డు డైరెక్టర్లు సతీష్ కె మరాఠే, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది, వేణు శ్రీనివాసన్, రవీంద్ర ధోలాకియా హాజరయ్యారు. డిప్యూటీ గవర్నర్లు మైఖేల్ దేవవ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు, టి రవిశంకర్ కూడా వచ్చారు.