
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడం షాక్ కు గురి చేసింది. రెండేళ్ళైనా ఆదిం ఉంటే బాగుండు అని కొంతమంది అనుకుంటే.. కనీసం ఫేర్ వెల్ టెస్ట్ ఆడి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ భావించారు. అయితే కోహ్లీ రిటైర్మెంట్ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ఫ్యాన్స్ కోహ్లీకి టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని ఓ రేంజ్ లో సెండ్ ఆఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాన్స్ ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ఐపీఎల్ రీ షెడ్యూల్ సోమవారం (మే 13) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. శనివారం (మే 17) బెంగళూరు లోని చిన్న స్వామీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు జరగబోయే ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ ఫ్యాన్స్ వైట్ జెర్సీలను ధరించి గ్రాండ్ గా నివాళులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ వైట్ జెర్సీ వెనక కోహ్లీ నెంబర్ 18 ఉండబోతున్నట్టు సమాచారం. అదే జరిగితే చిన్నస్వామి స్టేడియం కోహ్లీ నినాదాలతో దద్దరిల్లడం గ్యారంటీగా కనిపిస్తుంది.
ఐపీఎల్ 2025లో కోహ్లీ 505 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. కోహ్లీ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్‌లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి. ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న పటిదార్ సేనతర్వాత జరగబోయే మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. కనీసం రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లే టాప్-2 లో ఉండే అవకాశం ఉంది.