
రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ కోహ్లీ 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. డుప్లెసిస్ 55, మాక్స్ వెల్ 54 పరుగులతో చెలరేగారు. అనుజ్ రావత్ చివర్లో 11బంతుల్లో 29 పరుగులు చేయడంతో బెంగళూరు 20 ఓవర్లలో 171 పరుగులు చేయగల్గింది. లేకపోతే ఓ మోస్తారు స్కోరుకే పరిమితమయ్యేది. రాజస్థాన్ బౌలర్లలో అడమ్ జంపా, కేఎం ఆసీఫ్ లకు చెరో రెండు వికెట్లు, సందీఫ్ శర్మకు ఒక వికెట్ పడ్డాయి.
పాయింట్ల పట్టికలో ఇరు జట్లు 6 పరాజయాలతో ఉన్నాయి. మరో మ్యాచ్లో ఓడిపోతే మాత్రం రెండు జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారనున్నాయి. మరి ఎవరు గెలుస్తారనేది చూడాలి.