23 వేల కోట్లు ఇస్తే చాలు..ఆర్ కామ్ కు అప్పులిచ్చినోళ్ల ఆఫర్

23 వేల కోట్లు ఇస్తే చాలు..ఆర్ కామ్ కు అప్పులిచ్చినోళ్ల ఆఫర్

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్ కోసం రూ.23 వేల కోట్ల అప్పుల పరిష్కార‌‌ ప్లాన్‌‌ను (రిజల్యూషన్‌‌) లెండర్లు ఆమోదించారు. దీనిలో మెజార్టీ వాటా అంటే రూ.5,500 కోట్లు చైనీస్ బ్యాంక్‌‌లకే వెళ్తాయి. వీటి అసలు బకాయిల్లో 55 శాతం వరకు క్లియర్ అవుతాయి. చైనీస్ బ్యాంక్‌‌లు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్, చైనా డెవలప్‌‌మెంట్ బ్యాంక్, ఎక్స్‌‌పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్‌‌ ఆఫ్ చైనాలు రిలయన్స్‌‌ కమ్యూనికేషన్‌‌కు అప్పులిచ్చాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం, రిలయన్స్ ఇన్‌‌ఫ్రాటెల్‌‌లు చెల్లించని అప్పులను సెటిల్‌‌ చేసేందుకు ఇన్‌‌సాల్వెన్సీ అప్పుల పరిష్కార ప్లాన్‌‌ను ఆర్‌‌‌‌కామ్ క్రెడిటార్ల కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు ప్యానల్‌‌ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఈ కమిటీలో 38 లెండర్లు ఉన్నారు. రిలయన్స్ ఇన్‌‌ఫ్రాటెల్ లిమిటెడ్ టవర్,ఫైబర్ ఆస్తులు రూ.4,700 కోట్లకు రిలయన్స్ జియోకు దక్కుతాయి. ఆర్‌‌‌‌కామ్, రిలయన్స్ టెలికాం ఆస్తులు రూ.14 వేల కోట్లకు యూవీ అసెట్ రికన్‌‌స్ట్రక్షన్ పొందనుంది.