యోసు (కొరియా): ఇండియా డబుల్స్ టాప్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి మరో టైటిల్ దిశగా దూసుకెళ్తున్నారు. కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ మెన్స్ డబుల్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సాత్విక్–చిరాగ్ జంట 21–14, 21–17తో ఐదో సీడ్, జపాన్‌కు చెందిన టకురో హోకి–యుగో కబాయషి ద్వయంపై వరుస గేమ్స్‌లో విజయం సాధించింది.
లి గేమ్‌లో మొదటి ఆరు పాయింట్ల వరకూ ఇరు జంటలూ నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఈ దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి ఆధిక్యంలోకి వచ్చిన సాత్విక్–చిరాగ్ ఇక వెనుదిరిగి చూడలేదు. సెమీస్‌లో రెండో సీడ్ వీ కెంగ్ లియాంగ్–చాంగ్ వాంగ్ (చైనా)తో సాత్విక్–చిరాగ్‌తో పోటీ పడనుంది.
