అరెస్ట్ చేస్తే చేసుకోండి : కేటీఆర్

అరెస్ట్ చేస్తే చేసుకోండి : కేటీఆర్

ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యి బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానని.. నా వైపు నుంచి ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోలేదని వివరణ ఇచ్చినట్లు వెల్లడించారాయన. 

నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి అంటూ ఏసీబీ అధికారులకే చెప్పానంటూ చెప్పుకొచ్చారాయన. అరెస్ట్ చేసుకోండి.. జైల్లో పెట్టుకోండి.. నేను భయపడను అని విచారణలో ఏసీబీ అధికారులకే చెప్పానంటూ మీడియా ఎదుట మాట్లాడారు. కేసులకు భయపడను.. జైల్లో పెట్టినా భయపడను అంటూ చెప్పుకొచ్చారాయన. విచారణకు మళ్లీ పిలిస్తే వస్తానని.. ఫార్ములా ఈ రేసు కేసు విచారణకు సహకరిస్తానంటూ వెల్లడించారు కేటీఆర్.

ALSO READ | ముగిసిన కేటీఆర్ విచారణ.. ఫార్ములా ఈ కారు రేసు కేసులో రెండోసారి విచారణ

ఫార్ములా ఈ రేసు కేసు అనేది లొట్టపీసు కేసు.. మళ్లీ మళ్లీ అంటా ఇది లొట్టపీసు కేసు అంటూ కామెంట్స్ చేశారు కేటీఆర్. జైల్లో పెట్టాలనుకుంటే ఓ 15 రోజులు పెడతారేమో.. అంతకు మించి ఏమీ చేయలేరంటూ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా మాట్లాడారు కేటీఆర్.