సినిమా కెరీర్ ను వదులుకోవడానికీ రెడీ

సినిమా కెరీర్ ను వదులుకోవడానికీ రెడీ

కోయంబత్తూర్: రాజకీయాల కోసం సినీ కెరీర్ ను వదులుకోవడానికీ తాను సిద్ధమేనని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కమల్ వేడెక్కిస్తున్నారు. వరుస ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. తాజాగా కోయంబత్తూర్ లో నిర్వహించిన ప్రచారంలో తన రాజకీయ కెరీర్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే సినిమా కెరీర్ ను వదులుకోవడానికి రెడీ అన్నారు. 'నేను ప్రస్తుతం చేస్తున్న సినిమాలను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఒకవేళ నా రాజకీయ కెరీర్ కు నటన ఇబ్బందిగా మారితే యాక్టింగ్ వదిలేస్తా' అని కమల్ చెప్పారు.